లోకేష్‌లా ‘పప్పు’లా జగన్ తయారు కాగలరా?: పార్థసారథి

Jagan Deeksha YSRCP Leaders fires on Chandrababu and Lokesh in Jagan Farmers Deeksha at Guntur

Jagan Deeksha YSRCP Leaders fires on Chandrababu and Lokesh in Jagan Farmers Deeksha at Guntur

రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరులో చేపట్టిన రెండు రోజుల ‘రైతు దీక్ష’లో ప్రభుత్వంపై పంచ్‌లు పేలుస్తున్నారు వైసీపీ నాయకులు. సాధారణంగానే ప్రభుత్వంపై విరుచుకుపడే వైసీపీ నాయకులు జనసందోహాన్ని చూసేసరికి ఆనందం పట్టలేక తెగ కామెంట్లు చేసేస్తున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌లను టార్గెట్ చేసుకొని మరీ వాయగొడుతున్నారు.

వైయస్సార్ కాంగ్రె పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ‘జగనంట… ఏ రోజుకీ లోకేష్‌కు సమానం కాదంట. ఎట్లా సమానమవుతారండీ? లోకేష్‌లాగా, పప్పులా జగన్ తయారుకాగలరా? అని అడుగుతావున్నాను. కాలేడు. ఏనాడైనా సరే జగన్మోహన్ రెడ్డి మైకు పుచ్చుకుని, ఈ రాష్ట్రంలో తాగునీరు లేకుండా చేయగలనని చెప్పారా? ఏరోజైనా సరే, జగన్మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పగలరా? అని అడుగుతావున్నాను’ అంటూ మంత్రి సోమిరెడ్డికి ఘాటైన కౌంటర్లు ఇచ్చారు పార్థసారథి.

వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ “చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఈవెంట్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని గతంలో చేసిన పాదయాత్రలను చంద్రబాబు ఇప్పుడు చేస్తే… ఆయనను కర్రలు, చీపుర్లతో తరిమే పరిస్థితి ఉందన్నారు. అంతేగాక దేశవ్యాప్తంగా బాహుబలి చిత్రం సునామీ  సృష్టిస్తుంటే… మూడేళ్లుగా చంద్రబాబు దెబ్బకు రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటు అందరూ బలి అయ్యారని చురకలు అంటించారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌… అందినకాడికి రాష్ట్రాన్ని దోచుకుంటుందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.

అంతేగాక వైఎస్‌ జగన్‌కు నారా లోకేశ్‌కు ఏమాత్రం పోలికే లేదని, అసలు ఇద్దరి మధ్య పోలికవచ్చే ప్రసక్తే వద్దని విమర్శించారు. జగన్‌ బాహుబలి అయితే, లోకేశ్‌ బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్‌ అని అన్నారు. లోకేశ్‌ కు కనీసం సరిగ్గా పేపర్‌ కూడా చదవడం రాదని, అలాంటిది ఆయన మంత్రి…భవిష్యత్‌లో కాబోయే ముఖ్యమంత్రి అనటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు అనిల్ కుమార్.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.