జగన్ తెలుగు నేర్చుకోవాలట..!

Jagan needs to learn Telugu rather than Speaking English says TDP MLA Anitha in assembly

 

Jagan needs to learn Telugu rather than Speaking English says TDP MLA Anitha in assembly

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తెలుగులో సరిగ్గా మాట్లాడటం రాదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. అసెంబ్లీ సమావేశాల్లో పదోతరగతి పేపర్ లీకేజీ ఉదంతానికి సంబంధించి జరుతున్న చర్చలో చంద్రబాబుపై జగన్‌ మాటలపై తూటాలు పేల్చారు. ఆ తర్వాత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబులాగా వచ్చీరాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుండి కాదు తాము వచ్చిందనీ, హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న తాను 10క్లాస్‌ , ఇంటర్, డిగ్రీల్లో ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్ అనీ పోయి తెలుసుకోండి అని చంద్రబాబుకు చురకలంటించారు జగన్.

అంతేగాక మీ మాదిరిగా పిహెచ్‌డి డిస్‌కంటిన్యూ కాదు నేను.. మీమాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా ఎంఫిల్ చదివానని చెప్పే గుణంలేదని విమర్శించారు జగన్. అక్కడితో ఊరుకోకుండా ‘నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడావంటే అదీ వచ్చిరానీ ఇంగ్లీషు… నీ మాటలు చూస్తే నీలాంటోడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉంటారని చెప్పి పక్కన కెటిఆర్‌గారు అన్నారు. తెలుసుకోవయ్యా నీ ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏమంటా ఉందో… ఊరికే మాట్లాడమంటే మాట్లాడుతారు… ‘ అంటూ జగన్ చంద్రబాబుని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.

దాంతో అప్పటివరకు వెనకసీట్లలో హాయిగా కూర్చున్న టీడీపీ ఎమ్మెల్యే అనిత ఒక్కసారిగా లేచి ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డిని దుయ్యబట్టారు. అనిత మాట్లాడుతూ ” ప్రతిపక్ష నాయకులు ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు కానీ.. ముందు ప్రతిపక్షనాయకులను శాసనసభ అని కరెక్ట్‌గా పలకడం నేర్చుకోమనండి అధ్యక్షా..” తెలుగే సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తి ఇంగ్లీష్ గురించి మాట్లాడటం ఈరోజు హాస్యాస్పదం అధ్యక్షా. ఎందుకనంటే సాధారణంగా తెలుగే సరిగ్గా మాట్లాడటం రాదు. అలాంటిది గవర్నమెంట్ స్కూల్లో చదువుకొనేవాళ్ళందరూ ఇంగ్లీష్ కూడా ఒకరకంగా చెప్పాలంటే మీలా కోట్లు కోట్లు లేవు జనాలందరి దగ్గరా.. ఇంగ్లీష్ మీడియంల్లో ఎక్కడో యూనివర్సిటీల్లో చదవడానికి ‘ అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.