జైలవకుశ సీన్లు లీక్ – పోలీసులకు ఫిర్యాదు

Jai Lava Kusa team Complians to Police on Leakage Issue

సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు తెగ ఇబ్బంది పెడుతున్న అంశం లీకేజీ. సినిమా రిలీజ్‌కు ముందే షూటింగ్ సమయాల్లో, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆ చిత్ర యూనిట్‌లో ఎవరో ఒకరు చేతివాటం చూపిస్తుండడంతో ఇంటర్నెట్‌లో లీక్ అవుతున్నాయి. అంతేగాక సినిమా రిలీజ్ అయిన రోజే ఇంటర్నెట్‌లో సినిమా మొత్తం వచ్చేస్తుండడంతో దర్శక నిర్మాతలకు తలనొప్పిగా తయారైంది.

Jai Lava Kusa team Complians to Police on Leakage Issue

లేటెస్ట్‌గా ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జై లవ కుశ’ లీకుల బారిన పడటం టీమ్‌ని షాక్‌కి గురి చేస్తోంది. ఈ చిత్రం టీజర్‌ని జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోపు 54 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ షాట్లు కొన్ని ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్‌గా లీక్ అయ్యాయి.

See Also: అపర చాణక్యుడికి ఈయేడాదైనా గౌరవం దక్కేనా??

ఆ లీకైన షాట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో మొత్తం యూనిట్ షాక్‌కి గురయ్యింది.దీంతో ఎలా ఈ షాట్స్ లీకయ్యాయో తెలీక తల పట్టుకున్న చిత్రం యూనిట్ పోలీసులకు పిర్యాధు చేసారు. లీకైన షాట్స్ ని షేర్ చెయ్యొద్దని చిత్రం టీమ్ రిక్వెస్ట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంతమేర చర్యలు చేపట్టారు.

Jai Lava Kusa team Complains to Police on Leakage Issue

రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు అనుమానితులను కొంతమందిని అరెస్ట్ చేసారు. ఈ లీకేజ్ వెనక ఉన్న హస్తం ఎవరిది… ఎంతమంది ఈ వ్యవహారంలో తలదూర్చారనే విషయాన్ని ఈ రోజు వెల్లడిస్తామని చిత్రం టీమ్ తెలియజేసింది. మొత్తం మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి సినిమాకి లీకుల బెడద తప్పట్లేదు. మరోవైపు నాలుగు రోజుల క్రితం విడుదలైన అల్లు అర్జున్ సినిమా డీజేకి సంబంధించి మొత్తం సినిమాని ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యడంతో సినిమా దర్శక నిర్మాతలు హరీష్ శంకర్, దిల్‌రాజులు సైతం పోలీసులను ఆశ్రయించారు.

See Also: పనిచేయని సీసీ కెమెరాలు

Have something to add? Share it in the comments

Your email address will not be published.