సిగ్గులేని పాకిస్తాన్ ఆర్మీ

jammu-and-kashmir-pakistan-army-mutilates-bodies-of-two-indian-army-jawans

 jammu-and-kashmir-pakistan-army-mutilates-bodies-of-two-indian-army-jawans

దశాబ్దాలుగా దాయాది దేశాలు పరస్పర దాడులకు దిగుతున్న విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసు. అయితే మన దేశంలో జరుగుతున్న అభివ‌ద్ధిని చూసి ఓర్వలేని పాకిస్తానీలు పెంచుకున్న కక్ష అప్పుడప్పుడు సరిహద్దులోని జవాన్లపై చూపిస్తూ రాక్షసానందం పొందుతోంది. భారత్ యుద్ధం జరగలాని కోరుకుంటుందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.

జమ్మూకశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలో ఎల్‌వోసీ మీదుగా ఉన్న బీఎస్‌ఎఫ్‌ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇద్దరు జవాన్ల ప్రాణాలను తీసి అక్కడితో ఆగకుండా తమలోని పైశాచికత్వాన్ని బయటపెట్టింది. కాల్పుల తర్వాత చనిపోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకత్వాన్ని చాటుకుంది. పాక్‌ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారితోపాటు, ఓ బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు విడిచారని సైనిక వర్గాలు తెలిపాయి. ఒక జవానుకు గాయాలయ్యాయి. అయితే పాక్ కవ్వింపు చర్యలకు భారత ఆర్మీ దీటుగా బదులిచ్చింది.

అయినప్పటికీ పాక్‌ సైన్యం పిరికిపందల తరహాలో జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసిందని, అత్యంత హేయమైన ఈ చర్యకు దీటుగా బదులిస్తామని ఆర్మీ నార్తరన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో హెచ్చరించింది. కశ్మీర్‌లో అలజడుల నేపథ్యంలో పాక్‌ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో కూడా ఏడుసార్లు కాల్పులకు తెగబడింది. 2016లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి 228 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, వీటిలో 221 ఘటనలు అంతర్జాతీయ సరిహద్దులోనివే.

ఒకవైపు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఇంకో వైపు తీవ్రవాదులను సరిహద్దుల గుండా దేశంలోకి పంపడం చూస్తుంటే పాక్ కయ్యానికి కాలుదువ్వుతున్నట్లే ఉంది. కశ్మీర్‌లోని వేర్పాటువాదులకు ఆర్థికంగా సాయం చేస్తూ వారిని రెచ్చగొడుతోంది. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ది పొందాలని చూసి పాక్ చర్యలను భారత్ బలంగా తిప్పికొడుతోంది.

అయితే ఒకవేళ భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంగనక జరిగితే భారత్ కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం అడ్రస్‌లేకుండా పోవడం మాత్రం ఖాయం. ఇప్పటికే ప్రపంచంలో పెట్టుబడులు అస్సలు పెద్దగా రాని దేశాల లిస్ట్‌లో పాక్ ఉంది. దానికితోడు ఇప్పటివరకు గతంలో ఎన్నోసార్లు రాజకీయ అస్థిరత కారణంగా అభివృద్ధిలో చాలా వెనక్కిబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంగనక జరిగితే పాకిస్థాన్ యుద్ధంలో  సర్తవం కోల్పోవడమేకాకుండా  భారీ స్థాయిలో మానవ నష్టం కలుగుతుంది. అంతేగాక ఇస్లామాబాద్, కరాచీలాంటి నగరాలు నామరూపాలు లేకుండాపోతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంతలా నష్టపోతామని తెలిసి కూడా భారత సైన్యాన్ని గెలుక్కొని తన్నులు తినడంలో పాక్ సైన్యానికి మజా వస్తున్నట్లుగా ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.