లండన్ లో జనసేన పండుగ

jana sena party third birth anniversary celebrations in london

jana sena party third birth anniversary celebrations in london

లండన్: జనసేన పార్టీ మూడవ ఆవిర్భావ వేడుకలను పవన్ కళ్యాణ్ అభిమానులు లండన్ నగరం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లండన్ లో ని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ౩౦౦ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎన్ ఆర్ ఐ జనసేన, యూకే ఒక బృందంగా ఏర్పడి తమ అభిమాన నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం లో పని చేస్తామని తెలిపారు.

జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ గ కాకుండ సమస్యల మీద పోరాడే ఒక ముఖ్య వేదికగా ఉంటుందని, తమ నాయకుడి మీద తమకు అపార నమ్మకం ఉందని వారు పేర్కొన్నారు. జనసేన పార్టీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి తామందరం తమ నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ. జన సైన్యం లాగ కృషి చేస్తామని కార్యక్రమంలో ప్రతిన బూనారు.

కార్యక్రమంలో అయ్యప్ప గార్లపాటి , నాగ రమ్యకాంత్, రాకేష్, సురేష్ మొగంటి, మనోజ్, రాంబాబు సిరిపురపు, జగదీష్ గుండు, శ్రీరామ్ అంగజాల, రాజ్, శ్రీకాంత్ మద్దూరి, రుద్ర వర్మ బట్ట ,సుకేశ్, జాన్ అల్లంపల్లి, చిట్టిబాబు, అమెరికా నుంచి శశాంక్ నిమ్మల, చంటి, సతీష్ రెడ్డి,  ఇండియా నుంచి శంకర్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.