2019 ఎన్నికల్లో పవన్ కే అధికార పీఠం: నాగబాబు

హైదరాబాద్: “2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికార పీఠం ఎక్కుతుంది. బలైమైన తెలుగు దేశం పార్టీని ఓడించి జనసేన అధికారం సాధించుకుంటుంది. పవన్ కల్యాన్ లాంటి నిజాయితీ పరుడు అధికార పీఠం ఎక్కితే తప్ప ప్రజలకు మేలు జరగదని“ పవన్ కల్యాన్ అన్నయ్య నాగబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా వున్న నాగబాబు పవన్ కల్యాన్ పై చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి.

పవన్ కల్యాన్ ఇప్పుడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. ఏదైనా సమస్య తలెత్తితే పవన్ కల్యాన్ వున్నాడు ఆయనకు చెప్పుకోవచ్చనే అభిప్రాయం ప్రజల్లో స్థిరపడేలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన దగ్గర గోడు వెళ్ళబోసుకునే సంఘాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వీటన్నీటిని బేరీజు వేసుకునో ఏమో పవన్ కల్యాన్ రాబోయే ఎలక్షన్లలో గెలిచి అధికార పీఠం ఎక్కుతాడని నాగబాబు జోస్యం చెబుతున్నారు.

నాగబాబు ‘ఒక ఓటరుగా పవన్ అధికారంలోకి వస్తాడనే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నీతి, నిజాయితీ గల పవన్ వంటి వ్యక్తులు అధికారంలోకి రావడం ఎంతో అవసరం’ అని నాగబాబు తెలిపారు. జనసేన అధినేత ఎవరి నుంచి కూడా డబ్బులు తీసుకోలేదని, పైగా ఇతరులకోసం తన డబ్బును ఖర్చు చేశాడన్నారు.

జనసేన పార్టీని తన సొంత డబ్బుతో నడపడానికే పవన్ కల్యాన్ సినిమాల్లో నటిస్తున్నాడని ఆయన తెలిపారు. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం తీరును కూడా ఆయన విమర్శించారు. అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ అలాంటి అభివృద్ది ఏదీ తనకు కనబడలేదని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయని, అధికార దుర్వినియోగం జరుగుతోందని నాగబాబు ఆరోపించారు.

పవన్ కల్యాన్ ఓ వైపు తన ప్రసంగాల్లో తెలుగుదేశం పార్టీని సూటిగా విమర్శించకపోయినా, నాగబాబు ఈ విధంగా మాట్లాడటం తాను పార్టీ లో భాగం అవ్వడానికేనా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.