కార్పోరేట్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై చూపించండి: పవన్‌కళ్యాణ్

JanaSena Chief Pawan kalyan responds on Mirchi Farmers issue in two telugu states

JanaSena Chief Pawan kalyan responds on Mirchi Farmers issue in two telugu states

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్‌యార్డుల్లో మిర్చి కొనుగోళ్ళులేక ఆవేదన చెందుతూ నిరసనలు తెలియచేస్తున్న రైతాంగాన్ని ఇప్పటికైనా పట్టించుకోవాలని హితవు పలికారు. తెలుగు  రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసమంటూ  ప్రభుత్వాలు విదేశీ కార్పొరేట్‌ కంపెనీలపై చూపించే శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై చూపకపోవడంవల్లే వాళ్ళంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.

ఎంతో శ్రమించి పండించే రైతులు కన్నీరు పెట్టడం దేశానికి ఏమాత్రం మంచిది కాదన్న పవన్, మిర్చి పంటతోపాటు ఏ పంటనైనా ఎంత విస్తీర్ణంలో ఎంత వేయాలో రైతులకు ముందుగా తెలియజేయడంలో వ్యవసాయశాఖ విఫలమైతే, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించేటట్లు చేయలేకపోవడం మార్కెటింగ్‌ శాఖ వైఫల్యంగానే ప్రతీసారీ రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురౌతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

రైతుల పట్ల, వారి సమస్యల పట్ల చిన్నచూపు తగ్గించి ప్రభుత్వాలు ఇప్పటికైనా  క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు జనసేనాధిపతి. మార్కెట్లో ధరకు, గిట్టుబాటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలని ప‌వ‌న్‌ డిమాండ్‌ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.