చేనేత చేయూత సదస్సులను వివిధ దేశాల్లో నిర్వహిస్తాం: జనసేన ఎన్‌ఆర్ఐ విభాగం

 

జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో NRI జనసేన UK వ్యవస్థాపక సభ్యుడు అయ్యప్పస్వామి గార్లపాటి పార్టీ కార్యనిర్వాహక సభ్యులు తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, కోర్ కమిటీ సభ్యులు సందీప్ పంచకర్ల, మీడియా హెడ్ హరిప్రసాద్‌‌లను కలిసారు. NRI జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత చేయూత సదస్సు మరియు ఇతర కార్యక్రమాలను వివరించారు. ఇంగ్లాండ్‌లోనే కాకుండా వివిధ దేశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించదలచామని ఆయా దేశాల్లోని కార్యకర్తలు తమకు సందేశం పంపించారని అయ్యప్ప తెలిపారు.

అమెరికా నుంచి శశాంక్ నిమ్మల, లండన్‌లో ని నాగ రమ్యకాంత్, రుద్ర వర్మ బట్ట, నరేంద్ర మున్నలూరి, శివ గ్రంధి, చెర్రీ బాబు లు ఎంతో ఉత్సాహంగా తమకు వెన్నుదన్నుగా ఉండి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని అయ్యప్ప స్పష్టంచేశారు. NRI జనసేన చేసిన కార్యక్రమాలను అభినందించడంతో పాటు వారి అమూల్యమైన సలహాలను, మరిన్ని విశేషమైన కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలను రూపొందించాలని పార్టీ కమిటీ సభ్యులు అయ్యప్ప స్వామికి సూచించారు. త్వరలో పవన్‌కళ్యాణ్ కూడా NRI జనసేన కార్యాచరణ మీద దృష్టి పెడతారని ఈ సమావేశంలో పార్టీ కమిటీ సభ్యులు ఉద్ఘాటించారు. NRI జనసేన UK తరఫున అయ్యప్ప గార్లపాటి పార్టీ కోర్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.