‘జన సైనికుల్లారా’ కదలిరండి

JanaSena Party's call for the enthusiastic speakers,writers and analysts Exclusive for Ananthapuram

JanaSena Party's call for the enthusiastic speakers,writers and analysts Exclusive for Ananthapuram

జనసైనికులకు ఆహ్వానం పలికింది జనసేన పార్టీ. పార్టీలోని వివిధ విభాగాల్లో పనిచేయడానికి, తమ నైపుణ్యాన్ని పార్టీకి ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అనంతపురం జిల్లాతో మొదలవుతున్న ఈ కార్యక్రమం నెమ్మనెమ్మదిగా అన్ని జిల్లాలకు విస్తరిస్తుందని జనసేన పార్టీ ప్రకటించింది.

రాష్ట్ర స్థాయి సమస్యలపై అవగాహన ఉన్నవారిని వ్యాఖ్యాతలుగా, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్‌గానూ, విశ్లేషణ పరిజ్ఞానం కలిగిన వారికి అనలిస్టుగానూ ఆహ్వానం పలుకుతూ జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ పెోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకొనేవారు తమ పేరును నమోదు చేసుకుని వ్యాఖ్యాత.. కంటెంట్‌ రైటర్‌.. అనలిస్ట్‌లలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేయాలని సూచించింది.

JanaSena Party's call for the enthusiastic speakers,writers and analysts Exclusive for Ananthapuram

అంతేగాక దరఖాస్తు చేసుకున్న తరువాత జనసేన బృందంతో ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో వివిధ మాధ్యమాలు, పార్టీ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలియజేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం www.janasenaparty.org/resourcepersons ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తును వ్యక్తిగతంగా పొందడానికి శ్రీ బాలాజీ రెసిడెన్సీ, 11/129, వినాయక్‌ చౌక్‌, సుభాష్‌ రోడ్‌, సప్తగిరి సర్కిల్‌, అనంతపురం-515001 అనే అడ్రస్‌లో పొందాలని సూచించింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చని, ఈ ప్రకటన కేవలం అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేసింది జనసేన పార్టీ.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.