క్షమాపణ చెప్పిన రిలయన్స్ జియో, పేటీఎం

jio paytm apoligise for using prime minister narendra modi picture

దిల్లీ: వ్యాపార స్వలాభం కోసం టెలికాం రంగంలో ప్రముఖ నెట్ వర్క్ రిలయన్స్, పేటీఎం సంస్థలు ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాని నరేంద్రమోది చిత్రాన్ని వాడుకున్నందుకు ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరాయి

గత ఏడాది జియో 4జి సేవల నెట్ వర్క్ను ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నట్లు రిలయన్స్ జియో మోదీ ఫోటోతోపాటు ప్రకటన కూడా ప్రచురించింది. అదే విధంగా పేటీఎం కూడా ఇదే తరహాలో మోదీ ఫోటోను ఉపయోగించింది.

యంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 కింద ముందుస్తు అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు వాడటం నిషేధం. ఈ నేపధ్యంలో నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ రెండు సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.  ప్రభుత్వ అనుమతి లేకుండా నరేంద్ర మోదీ ఫోటోలను తమ ప్రకటనపై వాడుకున్నుందుకు ఈ రెండు సంస్థలు చెప్పినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.