యాసిన్ మాలిక్ అరెస్ట్

JKLF Chief Yasin Malik Arrested again in SriNagar today

జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకెఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు శ్రీనగర్‌లో శనివారం అరెస్టు చేశారు. మైసుమా ప్రాంతంలోని అతని నివాసంలో మాలిక్‌ను అరెస్టు చేశారని జేకెఎల్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. హురియత్‌ నేత సయ్యద్‌ అలీ గిలాని, మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌లతో కలిసి మాలిక్‌ కాశ్మీర్‌ వ్యాలీ విముక్తి కోసం ఏడాదికిపైగా పోరాడుతున్నారు.

JKLF Chief Yasin Malik Arrested again in SriNagar today

ఇటీవల జూన్ 1తేదీన జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత ముహమ్మద్ యాసిన్ మాలిక్ శ్రీనగర్ కేంద్ర కర్మాగారం నుంచి విడుదలయ్యాడు. మే 28న మాలిక్ ను మైసుమాలోని అతని ఇంట్లోనే అరెస్ట్ చేసారు. మే చివరి వారంలో పుల్వామా జిల్లాలోని సిమోహ్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్లు సబ్జార్ భట్, ఫైజాన్ అహ్మద్ లను మట్టుబెట్టగా సబ్జార్ భట్ ఇంటికి మాలిక్ పరామర్శకు వెళ్లాడు. కశ్మీర్‌లోయలో ఉద్రిక్తతలను పెంచుతున్నారన్న ఆరోపణలపై మాలిక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు అతనికి విధించిన ఐదు రోజుల కస్టడీ ముగియడంతో మాలిక్‌ను జూన్‌ 1న జైలు నుండి విడుదల చేసారు అధికారులు.

ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటననే జరిగింది.  పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్షను ఎదుర్కొన్న అఫ్జల్ గురు ఆత్మశాంతి కోసం నిర్వహించిన పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముంబై దాడుల కుట్ర సూత్రధారి హఫీజ్ సయ్యద్‌తో కలిసి వేదికను పంచుకున్నారు యాసిన్ మాలిక్. దీనిపై భారత్‌లో తీవ్రమైన నిరసనలతో పాటు విమర్శలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఆదివారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన యాసిన్ మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు.

తాజాగా శ్రీనగర్‌లో డీఎస్పీని అల్లరిమూకలు కొట్టి చంపిన నేపథ్యంలో కాశ్మీర్ లోయలో మాలిక్ బయటఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి అదుపులోకి తీసుకున్నారని సమాచారం

Have something to add? Share it in the comments

Your email address will not be published.