దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్‌

k vishwanath recieved Dada Saheb Phalke Award from President Pranab Mukharjee

k vishwanath recieved Dada Saheb Phalke Award from President Pranab Mukharjee

భారత చలన చిత్ర పరిశ్రమలో  అత్యున్నత పురస్కారాన్ని తెలుగు దర్శకుడు కె. విశ్వనాథ్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో  అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. మన దేశంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రతీ యేడాది దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందజేస్తారు. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఈ అవార్డును ఏర్పాటు చేసి  స్వర్ణ కమలం,శాలువా, పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. గతంలో విశ్వనాథ్‌ రూపొందించిన ‘శంఖరాభరణం’ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఇప్పటివరకు విశ్వనాథ్‌కు పది ఫిల్మ్‌‌ఫేర్‌, 5  నేషనల్‌ ఫిల్మ్‌పేర్‌, ఆరు నంది అవార్డులను వరించాయి.

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ ప్రసంగం ప్రారంభించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్ ప్రపంచంలో ఎక్కడ అభిమానులు ఉన్నా వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు. విశ్వనాథ్ సినిమాల్లో హింస, అశ్లీలత ఏమాత్రం ఉండదని ప్రశంసించారు.

ఉత్తమ నటుడిగా అక్షయ్‌కుమార్‌, ఉత్తమ నటిగా సోనమ్‌కపూర్‌, నిర్మాత దిల్‌రాజు, నృత్య దర్శకుడు రాజు సుందరం, నటుడు మోహన్‌లాల్, పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌భాస్కర్‌,  పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి, నటి సోనమ్ కపూర్‌లు అవార్డులు అందుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.