అంత్యక్రియల్లో పేలుళ్లు.. 18మంది మృతి

Kabul Funeral Blast Deadly blasts hit protest victim's funeral

Kabul Funeral Blast Deadly blasts hit protest victim's funeral

రక్తపాతానికి అడ్డాగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో మారణహోమం జరిగింది.  ఖేర్‌ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతుండగా.. వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 18 మంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

ఇటీవల అఫ్గాన్‌లోని కాబూల్‌లో దౌత్యకార్యాలయాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 80 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు నిరసనగా.. శుక్రవారం కాబూల్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో సెనేటర్‌ ఎజద్యార్‌ కుమారుడు మృతిచెందాడు.

శనివారం అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.