కాజల్ నిరీక్షణ ఫలించింది

కెరీర్ బిగినింగ్ లో నటీనటులు తమకు ఒక్క మూవీలో ఛాన్స్ వచ్చినా చాలనుకుంటారు. అప్పుడు కేరక్టర్ ఏంటన్నది చూడరు. అవకాశం వచ్చింది – పోగొట్టుకోకూడదనుకుంటారు. ఆ తర్వాత హీరో లేదా హీరోయిన్ కావడానికి రొటీన్ కేరక్టర్స్ వచ్చినా చేసేస్తుంటారు. తప్పదు కదా మరి. ఆ టైంలో .. .. నటనకు ఇంపార్టెన్స్ ఉండే కేరక్టర్స్ వస్తే బాగుంటుందనుకుంటారు. వెయిట్ చేస్తారు. ఎప్పటికో ఆ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు కాజల్ కు అలాంటి మంచి ఛాన్స్ వచ్చింది.

జనరల్ గా హీరోహీరోయిన్స్  ఎప్పుడూ ఒకే టైప్ రోల్స్ యాక్ట్ చేస్తుంటారు. అలా ఎంతకాలమని చేస్తారు. కొంతకాలానికి బోర్ కొడుతుంది. మంచి పాత్ర పడాలని, తన టాలెంట్ ఏమిటో చూపించాలని అనుకుంటారు. గ్లామర్ హీరోయిన్ కాజల్ కు కూడా మనసులో అదే కోరిక ఉంది. ఇంతవరకు కాజల్ ఎక్కువగా గ్లామ్ రోల్సే చేస్తోంది. కానీ హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉండే పాత్ర పడలేదు.

ఎప్పుడూ హీరోకేనా ఇంపార్టెన్స్? హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉండదా? అని హీరోయిన్స్ కు అనిపించడం సహజం. లేడీ ఓరియెంటెడ్ పిక్చర్స్ లో హీరోయిన్ కీలకం. ఇప్పటికే కొందరు హీరోయిన్స్  అలాంటి హీరోయిన్ కేరక్టర్స్ చేశారు. అలాంటి పాత్ర చేయాలని కాజల్ కు కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇంకా ఇంతవరకు హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఉండే రోల్ ఆమెకు రాలేదు.

నయనతార, త్రిష, ఛార్మి, ప్రియమణి వంటి హీరోయిన్స్ మంచి కేరక్టర్స్ వేశారు. కాజల్ కు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. తను ఏనాటి నుంచో వెయిట్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ పిక్చర్ లో నటించే ఛాన్స్ వచ్చింది. మహిళా ప్రాధాన్యమున్న ఓ సినిమాలో డైరెక్టర్ డిజే మొదట నయనతారను తీసుకుందామనుకున్నాడు. కానీ నయనతార బిజీగా ఉండడంతో ఆ అవకాశం కాజల్ ను వరించింది. ఇంకేముంది.. .. కాజూ వెంటనే ఓకే అనేసింది. తన వెయిటింగ్ ఫలించిందని చెబుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.