చెన్నైలో ఈనెల 29న ‘కళాసుధ’ పుర‌స్కారాలు

kala sudha-awards-going to held in Chennai on 29th announcement

kala sudha-awards-going to held in Chennai on 29th announcement

 

క‌ళాసుధ తెలుగు అసోసియేష‌న్ 19వ ఉగాది పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వం ఈ నెల 29న చెన్నైలో జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేసారు.

అందులో కళాసుధ సంస్థ అధ్య‌క్షుడు బేతిరెడ్డి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ 1998 న‌వంబ‌ర్ 21న ప్రారంభించి ఆ ఏడాదితో 19వ సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశిస్తున్నందుకు ఆనందంగా వుంది. 2016లో విడుద‌లైన చ‌ల‌న చిత్రాల‌లో 24 విభాగాల‌కు సంబంధించిన న‌టీన‌టుల‌ను, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ఉగాది పుర‌స్కార‌ముల‌తో, బాపు, చిత్రాల‌లో న‌టించిన న‌టీన‌టుల‌ను బాపు బొమ్మ, బాపు ర‌మ‌ణ పుర‌స్కార‌ముల‌తో స‌త్క‌రించ‌నున్నాం. వివిధ రంగాలలో నిష్ణాతులైన మ‌హిళామ‌ణుల‌ను మ‌హిళా ర‌త్న పుర‌స్కార‌ముల‌తో స‌త్క‌రించ‌నున్నాం. బాపు బొమ్మ పుర‌స్కారాన్నిన‌టి ఈశ్వ‌రీరావుకు, బాపు ర‌మ‌ణ పుర‌స్కారాన‌న్ని సీనియ‌ర్ న‌రేష్‌కు అందించబోన్నాం. అని తెలిపారు.

మా అధ్యక్షుడు  శివాజీరాజా మాట్లాడుతూ ..గ‌తంలో న‌టుడిగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యాను. ఈ సారి మా అధ్య‌క్షుడి హోదాలో హాజ‌రు కాబోతుండ‌టం ఆనందంగా వుంది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏడిద శ్రీ‌రామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.