కళాతపస్వికి అరుదైన గౌరవం

Kalatapasvi' K. Viswanath conferred Dadasaheb Phalke Award for 2016

Kalatapasvi' K. Viswanath conferred Dadasaheb Phalke Award for 2016

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావులను ఈ అవార్డు వరించింది. విశ్వనాథ్‌కు అవార్డు ప్రకటించిన విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. 2016 సంవత్సరానికి గానూ విశ్వనాథ్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో 1930లో జన్మించారు. కళాత్మక, సంగీత, నృత్య ప్రాధాన్యం ఉన్న అనేక చిత్రాలను తీశారు. 1992లో ఆయన పద్మశ్రీ అందకున్నారు. అయిదుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిల్మ్ కేటగిరీలో 20 నంది అవార్డులు గెలుచుకున్నారు. పదిసార్లు ఫిల్మ్ అవార్డు కూడా గెలిచారు.

1957లో ‘తోడికోడలు’ చిత్రంతో సౌండ్‌ విభాగంలో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా తొలిసారి మెగాఫోన్‌ పట్టి దర్శకుడయ్యారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రాల్లో శంకరాభరణం వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఆ చిత్రం ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది ఆ చిత్రం.

దేశం గర్వించ దర్శకుల్లో ఒకరైన విశ్వనాథ్ శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శృతిలయలు’, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి మరెన్నో అణిముత్యాల్లాంటి తెలుగు సినిమాలను ఆయన అందించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది.

‘స్వాతిముత్యం’ సినిమా ఆస్కార్‌ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందడం విశేషం. భారతీయ సినిమాకు విశ్వనాథ్‌ చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన విశ్వనాథ్‌ నటుడిగానూ తనదైన ముద్రవేశారు.

2016 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. మే 3 న జరుగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా కే విశ్వనాథ్‌ పురస్కారాన్ని అందుకుంటారు. భారతీయ చలనచిత్ర అభివృద్ధికి కృషి చేసినందుకు గాను విశ్వనాథ్ ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కింద ఆయనకు స్వర్ణ కమలాన్ని బహూకరిస్తారు. దీంతో పాటు పది లక్షల నగదును అందజేస్తారు. శాలువాతో సత్కరిస్తారు. 1965 నుంచి విశ్వనాథ్ సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆరుగురికి అరుదైన గౌరవం

ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆరుగురు తెలుగు సినీ ప్రముఖులకు దక్కింది. ఈ అవార్డును దక్కించుకొన్న వారిలో బీ నరసింహరెడ్డి, ఎల్వీ ప్రసాద్, బీ నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వర్ రావు, డీ రామానాయుడు ఉన్నారు. తాజాగా కే విశ్వనాథ్‌కు ఈ అవార్డును కేంద్ర ప్రకటించింది.

ఫాల్కే అవార్డు అందుకొన్న వారు వీరే..
1. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974)
2. ఎల్వీ ప్రసాద్ (1982)
3. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986)
4. అక్కినేని నాగేశ్వరరావు (1990)
5. డీ రామానాయుడు (2009)
6. కే విశ్వనాథ్‌ (2016)

Have something to add? Share it in the comments

Your email address will not be published.