వీడికిదేం నోటి దూల: RGV కి పోటీ అవుతున్నాడుగా

Kamaal R Khan KRK rants about Allu Arjun this time RGV

సినిమా ఇండస్ట్రీలో పక్కనోళ్ళని తిట్టడం, వెక్కిరించడం, పరువు తీయడం వంటి ఘటనలు ఎప్పటినుండో జరుగుతున్నప్పటికీ ఈమధ్య సోషల్ మీడియా అలవాటు ఎక్కువైనప్పటినుండి మరీ ఎక్కువైంది. ఇప్పటి వరకు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ, ప్రతీ ఒక్కరినీ ట్విట్టర్‌లో చెడుగుడు ఆడుకొనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ గుర్తొచ్చే పేరు రామ్‌గోపాల్ వర్మ అదే అందరూ ముద్దుగా పిలుచుకొనే ఆర్జీవీ.

Kamaal R Khan KRK rants about Allu Arjun this time RGV

మనిషి తెలుగువాడైనప్పటికీ ముంబై వెళ్ళి బాలీవుడ్‌లో సెటిల్ అయిపోవడంతో అక్కడి అలవాట్లు, గ్రూపు రాజకీయాలు వంట బట్టించుకొని ప్రతీ ఒక్కరిపై ట్వీట్లు చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీని మొదలుపెట్టి ఎంజాయ్ చేయడం ఆర్జీవీ స్టైల్. ఈమధ్య మెగాస్టార్ ఫ్యామిలీని ట్విట్టర్‌లో తెగ ఇబ్బంది పెట్టి, చివరికి అభిమానుల ఆగ్రహావేశాలతో భయపడ్డట్లు నటించడం, మళ్ళీ సందు దొరికితే చాలు తిరిగి రెచ్చిపోవడం వర్మకే దక్కింది. అలాంటి వర్మ బాటలో మరో మేధావి కూడా తయారయ్యాడు. వర్మకు ఉన్న నోటి దూలను కంటిన్యూ చేస్తూ ట్విట్టర్‌లో తనకొచ్చినట్లు సినిమా నటులపై అవసరంలేని కామెంట్లు చేస్తూ తన నోటి దూలను బయటపెట్టుకుంటున్నాడు బాలీవుడ్ క్రిటిక్ కమాల్ రషీద్ ఖాన్.

See Also: పీఠం కోసం తెర వెనుక మంతనాలు

మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నోటిదూల చూపించిన కెఆర్‌కె… ఆ తర్వాత బాహుబలి స్టార్స్ ప్రభాస్, దగ్గుబాటి రానా మీద కూడా తన దురహంకార వ్యాఖ్యలతో చెలరేగిపోయాడు. ఎప్పుడూ ట్విట్టర్లో ప్రముఖులపై ఏవో కారు కూతలు కూయడం, వారి అభిమానులతో తిట్లు తినడానికి అలవాటు పడ్డ కమాల్ రషీద్ ఖాన్ లేటెస్ట్గా అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేసి బన్నీ అభిమానుల మాటల తూటాలకు బలయ్యాడు. అల్లు అర్జున్ ఫెయిర్ అండ్ హాండ్సమ్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ గురించి “ఈ ఆలూ మొహం అంటూ.. ఈ రోజు నాకు ఎవరో చెప్పారూ… ఈ లుక్కా లుకింగ్ ఆలూ తెలుగులో పెద్ద స్టార్ అని. బ్రో నీవు ఏమైనా చిన్న రోల్స్ చేయాలనుకుంటే బాలీవుడ్‌కి రా….అంటూ బన్నీని కించపరుస్తూ ట్వీట్ చేశాడు.

దీంతో బన్నీ అభిమానులు కమాల్ రషీద్ ఖాన్ చేసిన కామెంట్లపై రివర్స్ పంచ్‌లు వేసి చుక్కలు చూపించారు. అంతేగాక ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ సోషల్ మీడియా వేదికగా పబ్లిసిటీ కోసం వెంపర్లాడే కమాల్ రషీద్ బాలీవుడ్ టాప్ హీరోలను కూడా వదిలిపెట్టలేదు. షారుఖ్, అనుష్కాశర్మ నటించిన  సినిమా పోస్టర్‌పైనా అనవసర కామెంట్‌ చేశాడు.

అంతేగాక కొన్ని రోజుల క్రితం రాఖీ సావంత్ మీద కూడా సంచలన కామెంట్స్ చేశాడు. ఆమెకు మగాళ్లతో అవసరం లేదని, ఆమె ఓ లెస్పియన్ అంటూ ట్వీట్ చేశాడు.

https://twitter.com/kamaalrkhan/status/881376039888236545

అంతకుముందు బాహుబలి 2 ని కూడా వదిలి పెట్టలేదు. అంతేకాదు ఆ సినిమాపై, ప్రభాస్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. హీరో ప్రభాస్ ఈ చిత్రంలో ఒక ఒంటెలా కనిపిస్తున్నాడని, ఇలాంటి ఒంటెలా వుండే హీరో ప్రభాస్‌ను ఎవరయినా బాలీవుడ్ నిర్మాతలు తీసుకొని చిత్రాన్ని తీస్తే వాళ్లంతా ఇడియట్స్ కింద మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు. అసలు బాహుబలి 2 లో కథేమీ లేదనీ, గ్రాఫిక్స్ కూడా పరమ చెత్త గా చూపించారని విమర్శించాడు. అంతేగాక రాజమౌళి ఇంత ఘోరంగా దర్శకత్వం చేస్తాడని తను అనుకోలేదని, ఇక సంగీతం కూడా పరమ దరిద్రంగా ఉన్దంటూ వ్యాఖ్యానించాడు.

మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చూడడానికి చోటా భీంలాగా ఉంటాడని, ఆయన మహాభారతంలో భీముడి పాత్రతో డబ్బులు, సమయం ఎందుకు వ‌ధా చేసుకుంటున్నారని విమర్శించాడు కెఆర్‌కె. అంతేగాక మమ్ముట్టి అనే సీ గ్రేడ్ నటుడు ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.

 

ఇలా రోజుకొక ముంబై మేధావి తమ నోటిదూలను బయటపెడుతూ అభిమానుల ఆగ్రహానికి గురౌతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.