నేనే ముఖ్యమంత్రి… సంచలన ట్వీట్ చేసిన కమల్

Kamal Haasan makes Controversy tweet and reverts back after

కమల్ హాసన్.. విలక్షణమైన నటనతో దేశంలోని సినీ అభిమానులందరినీ ఆకట్టుకుంటూ, మధ్య మధ్యలో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపే ఈ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది. ఈ మధ్య కాలంలో ఆయన ఏం చేసినా అది సంచలనమే. తమిళంలో ప్రసారమౌతున్న బిగ్‌బాస్ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తూ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా ఈ విషయంలో కమల్‌ హాసన్‌పై మండిపడుతున్నారు.

Kamal Haasan makes Controversy tweet and reverts back after

ఇలాంటి పరిస్థితుల్లో కమల్ హాసన్ చేసిన ఓ ట్వీట్ తమిళనాడు రాజకీయాలను షేక్ చేయడానకి రెడీ అయ్యింది.’నేనే ముఖ్యమంత్రిని’ అంటూ కమల్‌ చేసిన ట్వీట్లు.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారా? అన్న ప్రశ్నలను లేవనెత్తి పెద్ద చర్చకు తెరలేపింది.  కమల్‌ తన ట్విటర్‌లో.. కాసేపటిలో ఓ ప్రకటన చేస్తా. అప్పటివరకు ఓపికపట్టండి అంటూ మొదట ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పెట్టిన కొద్దిసేపటికే.. నన్ను ఓడిస్తే తిరగబడతా. నేను అనుకుంటే నేనే ముఖ్యమంత్రిని. రండి.. మూర్ఖులకు వ్యతిరేకంగా పోరాడేవాడే లీడర్‌ అని ట్వీట్‌ చేశారు. దాంతో కమల్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారంటూ ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.

అయితే దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల తమిళనాడు ఆర్థికమంత్రి డి.జయకుమార్ కమల్‌కు సవాల్ విసిరారు. దానికిముందు న్యాయశాఖ మంత్రి షణ్ముగం కూడా కమల్‌ను ఘాటుగానే విమర్శించారు. దీంతో వీళ్ళు చేసిన వ్యాఖ్యలను కమల్ సీరియస్‌గా తీసుకున్నారా? క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? ఈ నేపథ్యంలోనే కమల్ ఈ ట్వీట్ చేశారా? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.

See Also: ఇది ఏమైనా ఈస్టిండియా కంపెనీనా? : కమల్‌హాసన్

అంతేగాక  ఇటీవలి కాలంలో కమల్‌ వ్యాఖ్యలను గమనిస్తే రాజకీయాల పట్ల ఆయన ఆసక్తి చూపుతున్నారనే అనుమానం వస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలపై విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే  కమల్ హాసన్ 11 లైన్ల పవర్ ఫుల్ కవితను పోస్ట్ చేశారు. “ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని. లొంగి ఉండటానికి నేను బానిసను కాను. కిరీటాన్ని వదిలిపెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నాతో పాటు రండి కామ్రేడ్… అసంబద్ధతను బద్దలు గొట్టే నాయకుడిగా తయారవుతారు” ఈ విధంగా కొనసాగింది ఆయన కవిత్వం.

See Also: ఆ రెండిటి వల్ల చాలా బాధలు అనుభవించా: రజినీకాంత్

తన ట్వీట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో కమల్ దిద్దుబాటు చర్యకు దిగారు. అందులోభాగంగా ఓ ప్రెస్‌ రిలీజ్‌ ద్వారా తన ట్వీట్ పై వివరణ ఇచ్చారు. ప్రో కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో ‘తమిళ్ తలైవాస్‌’ జట్టుకి కమల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిచబోతున్నారు. ఈ విషయం ప్రకటించడానికే కమల్‌ సరదాగా ఇలా ట్వీట్లు పెట్టి కాసేపు తన అభిమానులను ఆటపట్టించారని అందరూ నిట్టూరుస్తున్నారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.