ఇది ఏమైనా ఈస్టిండియా కంపెనీనా? : కమల్‌హాసన్

Kamal Hassan controversial comments on GST and Central government

 

Kamal Hassan controversial comments on GST and Central government

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే కమల్‌హాసన్ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇటీవల కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయమైన జీఎస్టీ విధానానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్లాబ్ విధానంపై మండిపడుతున్నారు.

జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీఒకే పన్ను విధానంలో 5,12,18,28 స్లాబుల్లో వస్తు, సేవల పన్నును నిర్ణయించారు. అయితే చిత్ర పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ పన్ను విధించడాన్ని తప్పుబడుతున్నాడు కమల్‌హాసన్. జీఎస్టీ విధానాన్ని తాము స్వాగతిస్తున్నామని అయితే ప్రాంతీయ చిత్రాలే దేశీయ సినిమాకు బలమని అనుకుంటున్నప్పుడు లోకల్ సినిమాలకు, అంతర్జాతీయ సినిమాలకు ఒకే విధమైన పన్ను విధించడం వల్ల ప్రాంతీయ, చిన్న సినిమాలతోపాటు చిత్ర పరిశ్రమే నష్టపోతుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జీఎస్టీ విధానాన్ని తాను ఏమాత్రం ఒప్పుకోనన్న కమల్‌హాసన్ సినిమాలపై విధించిన జీఎస్టీ రేటును 12 లేదా 15 శాతానికి తగ్గించకపోతే సినిమాల నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. అంతేగాక చిన్న సినిమాలపై భారీగా పన్నులు విధించడం ఏంటనీ.. ఇదేమైనా ఈస్ట్‌ఇండియా కంపెనీనా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరోవైపు ఇప్పటికే తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ జీఎస్టీ పన్ను విషయంలో పునఃపరిశీలన చేయాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. అయితే పరిశ్రమ వర్గాల ప్రతిపాదనల మేరకు ఇప్పటికే నిర్ణయించిన కొన్ని వస్తువుల పన్ను రేట్లను కమిటీ పునఃపరిశీలించనుంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.