కంగనకి కత్తిగాటు పెట్టిన క్రిష్

Kangana Ranuat rush to hospital after hit on head by sword in Manikarnika

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా ‘మణికర్ణిక – ది క్వీన్‌ ఆఫ్ ఝాన్సీ’. తెలుగులో బాలక‌‌ృష్ణ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత కంగనా ప్రధానపాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కంగనా నటనకు గుడ్‌బై చెప్పనుంది. ఓ నటిగా తనకి ఇదే ఆఖరి సినిమా అని ఆ తర్వాత ఇక సినిమాలకు దర్శకత్వం వహిస్తానని గతంలో  కంగనా వెల్లడించింది.

Kangana Ranuat rush to hospital after hit on head by sword in Manikarnika

అయితే మణికర్ణిక షూటింగ్‌లో  కంగనా ఎలాంటి డూప్‌ లేకుండా చేస్తానని చెప్పిందని… కత్తిసాము చేయడానికి చాలాసార్లు ప్రయత్నించిందని.. అయితే ఈసారి కంగనా తన సహనటుడు నిహర్‌ పాండేతో కత్తి సాము చేస్తుండగా కంగనా నుదురుపై కత్తి గాటు పడింది. ఇప్పటికి చాలాసార్లు కంగనా కత్తిసాము చేస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం గురి తప్పిందని నిర్మాత కమల్‌ జైన్‌ తెలిపారు. కత్తిగాటు పడగానే వెంటనే సినిమా యూనిట్ ఆమెని చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలిచింది. ఈ ప్రమాదంలో కంగనా ముఖానికి 15 కుట్లు పడినట్లు చిత్రవర్గాల సమాచారం. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

See Also: జీఎస్టీ దెబ్బతో రజినీ, ప్రభాస్‌ బాటలో మహేశ్‌

కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని వైద్యులు చెప్పినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఇప్పుడైతే కంగనాకి ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఆమె నుదురుపై కత్తిగాటు అలాగే ఉండిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అయినా కూడా ఈ కత్తిగాట్లను ఝాన్సీ లక్ష్మీబాయ్‌ కోసం భరిస్తానని కంగనా చెప్పిందట. కంగనా పూర్తిగా కోలుకున్నాక ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.