లండన్ లో కాటమరాయుడు

లండన్: తమ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటంరాయుడు సినిమా ప్రీమియర్ షో కి లండన్ నలుమూలల నుంచి అభిమానులు భారీగా తరలి వచ్చారు. యునైటెడ్ కింగ్డమ్ లో 60 థియేటర్స్ పైగా ఈ చిత్రం విడుదల అవ్వటం విశేషం. తమ అభిమాన నటుడి దుస్తులను ధరించి థియేటర్స్ లో కోలాహలం చేసారు. కాటంరాయుడు పవర్ స్టార్ కెరీర్ కి ఇది ఒక మైలు రాయి అవుతుంది అని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ సంబరాలలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు నాగ రమ్యకాంత్, అయ్యప్ప గార్లపాటి, రుద్ర వర్మ బట్ట, ఆదిత్య అల్లాడి, బలరాం విష్ణుబొట్ల, నరేంద్ర మున్నలూరి, బాజీ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, శ్రీరామ్, రాంబాబు, ఉదయ్ ఆరేటి, పాల్గొని ప్రీమియర్ షో కి ఏర్పాట్లు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.