అభిమానుల దెబ్బకి ‘కాటమరాయుడు’ వెబ్‌సైట్ క్రాష్

Katamaryudustore website crashed due to heavy flow from Pawan Kalyan Fans

Katamaryudustore website crashed due to heavy flow from Pawan Kalyan Fans

కాటమరాయుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రంపై క్రేజ్ పెరిగిపోతోంది. ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. ఆడియో ఫంక్షన్ లేకుండా పాటలు నెట్లో విడుదల చేస్తూ అభిమానులను రోజుకోరకంగా ఊరిస్తున్నారు. పవన్ కళ్యాన్ ఒకవైపు రాజకీయాలపై దృష్టిపెడుతూనే మరో వైపు సినిమా చేస్తూ బిజీ గా వున్నాడు.

కాటమ రాయుడు సినిమా గురించి అభిమానులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాన్‌కి వున్న క్రేజ్ ఇప్పటికే బాలీవుడ్ స్థాయిలో వుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ హీరోలను కూడా ఆలోచింపచేస్తున్న కాటమరాయుడు రోజుకో ఆసక్తి కరమైన విషయంతో మీడియాలో నానుతుంది. రోజుకో పోస్టర్, ఆన్‌లైన్‌లోనే సాంగ్స్ విడుదలవుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న కాటమరాయుడు మరో ఆసక్తి కరమైన విషయం బయటికొచ్చింది.

కాటమరాయుడు క్రేజ్‌ను ప్రేక్షకుల్లో ఉన్న అభిమానాన్ని మరింత పెంచడానికి చిత్ర నిర్మాణ సంస్థ North Star Entertainment ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. Echora అనే సంస్థను official merchandiseగా నియమిస్తూ, వారితో అనుసంధానమై, కాటమరాయుడు T – Shirts మరియు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో వాడిన లాంటి పచ్చ రంగు towels ను Online ద్వారా మరియు నేరుగా Echora డీలర్ల వద్ద ,తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో కాటమరాయుడు విడుదలయ్యే కేంద్రాల్లో లభ్యమవుతాయని  చిత్ర నిర్మాణ సంస్థ తెలియ చేసింది . అభిమానులను దృష్టిలో పెట్టుకొని వారికి అందుబాటు ధరకు ఇవి లభ్యమౌతున్నాయి. Online లో పై వాటిని కొనదలచిన వారు katamarayudustore.com website ద్వారా కొనుగోలు చేస్కోవచ్చు. రెండ్రోజుల క్రిందట ఇవి మార్కెట్ లో విడుదలయ్యి పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి . అయితే అభిమానుల తాకిడికి కాటమరాయుడుస్టోర్ వెబ్‌‌సైట్ కాస్తా లోడ్ భరించలేక క్రాష్ అయిపోయింది.

మొత్తానికి రాయుడి హవా ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. అదే సమయంలో శనివారం మార్చి18 సాయంత్రం అభిమానుల మధ్య ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించడానికి సన్నహాలు పూర్తయ్యాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.