క్షమించండి….

kattappa baahubali satyaraj Apologise To Kannadigas

kattappa baahubali satyaraj Apologise To Kannadigas

హైదరాబాద్: ఎట్టకేలకు కన్నడ నటుడు సత్యరాజ్ కన్నడీకులకు క్షమాపణ చెప్పారు. 9 ఏళ్ల కిందట సత్యరాజ్ వ్యాఖ్యలకు కర్ణాటకలో గొడవలకు కారణమైన విషయం అందరికి తెలిసిందే. కావేరి జలాల విషయంలో కన్నడీకులకు వ్యతిరేకంగా సత్యరాజ్ మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో కన్నడీకులు బాహుబలిని చిక్కుల్లోకి నెట్టేసింది. కావేరి జలాల విషయంలో కన్నడీకులకు వ్యతిరేకంగా మాట్లడంతో అప్పటి నుంచి కొందరు కన్నడీకులు సత్యరాజ్ అంటేనే మండిపడుతున్నారు.

కట్టప్ప సత్యరాజ్‌ కావేరీ జలాలపై కర్ణాటకకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి ఇప్పుడు కర్ణాటకలో సినిమా విడుదలపైనే నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కావేరీ జలాల విషయంలో నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల కారణంగా ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ సినిమాను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.

“తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని కన్నడ ప్రేక్షకులకు సత్యరాజ్ విజ్ఞప్తి చేసారు. కావేరి ఉద్యమ సమయంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్నారు. కర్ణాటకలో కొందరు నటులు ఆవేశంగా మాట్లాడంతో ఆ వ్యాఖ్యలు చేయల్సి వచ్చిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కన్నడీకులకు మనసు గాయపడితే క్షమించమని కోరారు. ఈ నా వ్యాఖ్యలు సినిమా విడుదలకు అడ్డంకి కాకూడదని“ సత్యరాజ్ కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.