సరిగ్గా మాట్లాడటం చేతకానివాడు మంత్రా???

katti padmarao fires on Nara Lokesh and Chandrababu

katti padmarao fires on Nara Lokesh and Chandrababu

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌పై దళితనేత కత్తి పద్మారావు విరుచుకుపడ్డారు. గ్రామాలు అంటే తెలియని నారా లోకేష్‌ను సీఎం చంద్రబాబు పంచాయతీ రాజ్ శాఖామంత్రిని చేశారని కత్తి పద్మారావు ఎత్తిపొడిచారు. రాజకీయాలు తెలియని, సరిగ్గా మాట్లాడటం చేతకాని లోకేష్‌ను మంత్రిని చేశాంరటూ ఎద్దేవా చేశారు.

అమెరికాలో చదివి, పాల వ్యాపారం చేసుకొనే వ్యక్తికి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు కత్తి పద్మారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితులని విస్మరిస్తోందని, చంద్రబాబు దళిత వ్యతిరేక శక్తిగా తయారయ్యారని కత్తి పద్మారావు విమర్శించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.