కెసిఆర్ కాపీ కొట్టారా??

KCR Copy Row Ponnala Lakshmaiah makes a sensational comments on Bangaru Telangana slogan from KCR

KCR Copy Row Ponnala Lakshmaiah makes a sensational comments on Bangaru Telangana slogan from KCR

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ముందుండి ప్రజలను నడిపించి రాష్ట్ర సాధనే ధ్యేయంగా తన చతురతను ఉపయోగించి రాష్ట్రాన్ని సాధించుకొని తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే నెంబర్1 ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకొన్న కెసిఆర్ బంగారు తెలంగాణా నినాదం మాత్రం ఎవరి దగ్గరి నుండో కాపీ కొట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ముందుగానీ, ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కానీ బంగారు తెలంగాణా ఏర్పాటే తమ లక్ష్యం అని చెప్పుకొంటున్న కెసిఆర్ ఆ నినాదాన్ని కాపీ కొట్టారని వస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయి. మాటల్లో చతురత, ఎలాంటి సందర్భాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకోగలిగే సత్తా ఉన్న నాయకుడిగా పేరున్న కెసిఆర్ ఓ నినాదాన్ని కాపీ చేశారని అన్నది ఎవరో కాదు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.

బంగారు తెలంగాణా నినాదం తనదేనని, 2014 సార్వత్రిక ఎన్నకల సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కాపీ చెప్తున్న లక్ష్మయ్య ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. అంతేగాక టీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు ముగ్గురు రైతులను బలితీసుకుంటుందని, ఇది బకాసుర ప్రభుత్వమని పొన్నాల ఘాటుగా విమర్శించారు. అందుకే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల అన్నారు.

మొత్తానికి కేసీఆర్‌ బంగారు తెలంగాణా నినాదాన్ని కాపీ కొట్టారని చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. బంగారు తెలంగాణా నినాదమేకాకుండా కాంగ్రెస్ నాయకుల నుండి కేసీఆర్ ఇంకా ఏం కాపీ కొట్టారో , ఎప్పుడు ఎవరు ఏం బయటపెడుతారోనని ఆసక్తి జనాల్లో నెలకొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.