అది పక్కా రాజకీయ కుట్రే : కెసిఆర్

Telanagana Cm KCR Fires on Opposition Leaders in BAC Meeting on Mirchi Farmers Agitation

Telanagana Cm KCR Fires on Opposition Leaders in BAC Meeting on Mirchi Farmers Agitation

ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతుల ఆందోళన, విధ్వంసంపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ అయ్యారు. భూసేకరణ బిల్లులోని సవరణలను అసెంబ్లీ ఆమోదించే విషయమై జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం కెసిఆర్ సీరియస్ కామెంట్స్ చేశారట. ఖమ్మం మార్కెట్‌ యార్డులో అలర్లు, విధ్వంసం రాజకీయ కుట్రతో, ప్రథకం ప్రకారమే జరిగాయని ఆయన బిఎసి సమావేశంలో ఘాటుగానే మాట్లాడారట.

 

Telangana BAC Meeting

అంతేగాక ఖమ్మం మిర్చి యార్డులో జరిగింది కృత్రిమ ఆందోళననే అని, రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిని చేశారని కెసిఆర్ అన్నారు. ఖమ్మం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయన్న కెసిఆర్ వివరాలను స్వయంగా తానే బయటపెడతానని బిఎసిలో చెప్పారట. ఈ విధ్వంసానికి కారణమైనవారిపై అంతేస్థాయిలో కేసులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. భూసేకరణ బిల్లులోని సవరణల ఆమోదం కోసం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా భూసేకరణ బిల్లు చర్చించే అవకాశముందని అందరూ భావిస్తున్నప్పటికీ ఖమ్మం మిర్చి రైతుల ఆందోళనపై చర్చ ఖచ్చితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana BAC Meeting

వాడివేడిగా జరిగిన బిఎసి సమావేశంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు, జానారెడ్డి, పాషాఖాద్రి హాజరయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ, బిజెపి సభ్యులు సస్పెండైనందున ఆ రెండు పార్టీలకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.