‘అమిత్‌ షా’ దుమ్ము దులిపిన కేసీఆర్

KCR fires solvos at BJP National President Amit Shah

KCR fires solvos at BJP National President Amit Shah

  • అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ కేసీఆర్
  • తెలంగాణ దేశంలోనే సంపన్నమైన రాష్ట్రం
  • నల్గొండ పర్యటనలో అమిత్ షా చెప్పినవన్నీ అవాస్తవాలే
  • వ్యక్తిగతంగా నన్ను తిట్టినా పడతా. తెలంగాణాను తిడితే సహించను.
  • మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దు
  • బీజేపీ కూడా ఒక పార్టీనా?
  • రాష్ట్రం విడిచి వెళ్లకముందే తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి

2019 ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణాలో పర్యటిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లా పర్యటనలో అమిత్ షా అనేక అవాస్తవాలను ప్రచారం చేశాడని కేసీఆర్ విమర్శించారు. ఈ అవాస్తవాల విషయంలో ముఖ్యమంత్రిగా తాను మౌనంగా ఉంటే అమిత్‌షా చెప్పిన మాటలన్నీ వాస్తవాలు అని  ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందనే వివరణ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణా ముందు నుండీ ధనిక రాష్ట్రమని చెప్పిన కేసీఆర్ తాము కేంద్రం దయదక్షిణ్యాలమీద ఏమాత్రం బతకట్లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే నిధుల ద్వారానే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని కెసిఆర్ తెలియచేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని, తాను చెప్పిన మాటలు అవాస్తవాలనీ రుజువు చేస్తే రాజీనామాకు సిద్దమని కెసిఆర్ ప్రకటించారు. అదే సమయంలో అమిత్ షా చెప్పినవి వాస్తవాలనీ నిరూపిస్తారా అని బిజెపికి సవాల్ విసిరారు కేసీఆర్.

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి మోడీ సహా, కేంద్రమంత్రులు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రశంసిస్తున్న విషయాన్ని గుర్తుకుపెట్టుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రీయల్ పాలసీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను పలువురు ప్రశంసించాయని ఆయన చెప్పారు. కేంద్రం నుండి లక్షకోట్లకుపైగా నిధులు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేయడాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు ప్రచారం చేసినందుకుగాను అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను కించపర్చేవిధంగా మాట్లాడారనన్న కేసీఆర్ తెలంగాణ ప్రగతిని దెబ్బకొట్టేలా అమిత్ షా మాట్లాడారని విమర్శించారు. 2016-17 లో కేంద్రానికి రాష్ట్రం నుంచి 50వేల13 కోట్ల రూపాయలు అందాయని, 2016-17 లో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు కేవలం  24వేల561 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. ఇప్పటివరకు చాలమంది అమిత్ షాలను చూశానన్న కెసిఆర్ తెలంగాణను అవమానించిన చరిత్ర బిజెపిదేనని ఘాటుగా విమర్శించారు.

అంతేగాక అమిత్ షాతో సహా బిజెపి నాయకులు దళితుల ఇళ్ళల్లో సహపంక్తి భోజనాన్ని హస్యాస్పదం చేశారని విమర్శించారు కెసిఆర్. అంతేకాదు చండూరు మండలంలోని తేరటుపల్లిలో దళితుల ఇళ్ళలో వండిన భోజనాన్ని అమిత్ షా తినలేదన్నారు. తేరట్‌పల్లి గ్రామంలో బిజెపి నాయకుడు మనోహార్ రెడ్డి వండిన భోజనాన్ని తేరట్ పల్లికి తీసుకువచ్చారన్నారు.అయితే తేరట్ పల్లిలో దళితులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. మరో వైపు పెద్దదేవులపల్లికి నిర్వహించిన సహపంక్తి భోజనానికి నల్గొండ నుండి అన్నపూర్ణ మెస్ నుండి బోజనం వెళ్ళిందని కేసీఆర్ ఆరోపించారు.

అంతేగాక మోడీ తీసుకొనే మంచి కార్యక్రమాలను తాము సపోర్ట్ చేస్తామన్నారు.అయితే అమిత్ షా గతంలో వచ్చిన సమయంలో తాము మాట్లాడలేదన్నారు. కానీ, తమపై తప్పుడు ప్రచారం చేయడంతోనే తాను నోరు మెదపాల్సి వచ్చిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకించేవారు ఎవరైనా క్షమించే ప్రసక్తేలేదన్నారు కేసీఆర్.

తెలంగానా ఏర్పడ్డ కొత్తల్లో కరెంట్ విషయంలోనూ  చాలా ఇబ్బందులు పడ్డామని, కేంద్రం తీరు వల్లే తెలంగాణకు మొదట్లో కరెంట్ సమస్యలొచ్చాయని తెలిపారు. కేంద్రాన్ని ఏదడిగినా ఇస్తామంటారు కానీ ఒక్క జాతీయ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇవ్వలేదని దుయ్యబట్టారు. అంతేగాక రాష్ట్రం విడిచి వెళ్లకముందే తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్.

తెలంగాణను నిందించే ఎవరైనా మాకు శత్రువులేనని, తెలంగాణానే మాకు బాద్ షా అని చెప్పుకొచ్చారు కేసీఆర్. తాజా సర్వే ప్రకారం బీజేపి సింగిల్ సీట్ కూడా గెలిచే అవకాశం లేదని తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. సహనానికి కూడా హద్దులుంటాయని అసలు బీజేపీ కూడా ఒక పార్టీనా? అని ప్రశ్నించారు. అంతేగాక జీహెచ్‌ఎంసీలో బీజేపీ సత్తా ఏంటో తేలిపోయిందని, ఎంఐఎం ఉన్న చోట బీజేపీ ఒక్క సీటు కూడా రాదని తేల్చేశారు కేసీఆర్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.