దిగుమతి చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి: కెసిఆర్

KCR inagurates distribution of Sheep to Golla kurumas in the state

తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 35 లక్షల గొల్లకురుమలున్న రాష్ట్రంలో ప్రతి రోజు 650 లారీల గొర్రెలు హైదరాబాద్‌కు వస్తున్నాయని చెప్పారు. ప్రతీరోజు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.  అంతేగాక  650 లారీలను దిగుమతి చేసుకోవడం కాదు.. ప్రతీ రోజు ఆరు వేల లారీల గొర్రెలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణాలోని గొల్లకురుమలు పోవాలని స్పష్టంచేశారు.

KCR inagurates distribution of Sheep to Golla kurumas in the state

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 400కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక వేదికగా శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డోలు వాయించి అర్హులైన గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ, బీమా పత్రాలను అందజేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి. వేదికపైకి చేరుకున్న సీఎం ప్రజలకు అభివాదం చేశారు. గొల్లకురుమలు ధరించే రుమాలు, గొంగడి ధరించిన సీఎం కురుమల డోలు వాయించారు. రుమాలు, గొంగడి ధరించిన సీఎం గొల్లకురుమలకు ప్రతీకగా దర్శనమిచ్చారు.

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 1500 యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేశారు. ఈ ఏడాదికి 3,60,098 మందికి గొర్రెల యూనిట్లు రాగా, వచ్చే ఏడాది మరో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి 8,710 గ్రామ పంచాయతీల్లో 7,846 సొసైటీల్లో 7,18,069 మంది(18 సంవత్సరాలు నిండిన వారు) సభ్యులుగా చేరారు.

తెలంగాణ గొల్లకురుమలు నా దృష్టిలో గొప్ప సంపద అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మూడేళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతమైన గొల్లకురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పుకుంటామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో 25వేలకోట్ల రూపాయల సంపదను గొల్లకురుమలు సృష్టించబోతున్నారని, 1948-56 మధ్య కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆనాడు వేల ఉద్యమ సభల్లో ఇదే చెప్పానని గుర్తు చేశారు. నాడు తాను చెప్పింది.. నేడు నిజమైందని చెప్పుకొచ్చారు.

ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని స్పష్టం చేసిన కెసిఆర్ గ్రామసీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయని, మానవ సంపదను కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు ఉంటుందని ఉద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యమని తేల్చిచెప్పారు కెసిఆర్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.