ఆర్టీసీని కాపాడుకొనే బాధ్యత అందరిదీ: కేసీఆర్

kcr-launches-vajra-bus-services-from-hyderabad-and-assured-rtc-for-more-funding

kcr-launches-vajra-bus-services-from-hyderabad-and-assured-rtc-for-more-funding

తెలంగాణాలో ఆర్టీసీని బలోపేతంచేసే దిశలో అడుగులు వేస్తోంది రాష్ట్రప్రభుత్వం. అందులోభాగంగా ప్రస్తుత ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏసీ బస్సులను మరిన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ‘ప్రజల ముంగిట బస్సులు’ పేరిట ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర మినీ బస్సులను  సీఎం కేసీఆర్, రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.

ఫస్ట్‌ ఫేజ్‌లో హైదరాబాద్ – నిజామాబాద్ మధ్య 30 బస్సులు, హైదరాబాద్ -వరంగల్ మధ్య 30 బస్సులు నడవనున్నారు. అంతేగాక ఈ బస్సులను హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన కాలనీల నుండి వజ్ర బస్సులు నడవనున్నాయి. అంతేగాక అంతేగాక ఆర్టీసీ ప్రత్యేక మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంచ్ చేశారు.

ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనపై ఉందని, తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు కేసీఆర్. అంతేగాక టీఎస్‌ఆర్టీసీని చూసి ఇతర రాష్ర్టాలు నేర్చుకోవాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ నెత్తిమీద ఎప్పుడూ కత్తి వేలాడుతుండేదని అందుకే ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారేమోనని ప్రజల్లో, ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన ఉండేదన్నారు కేసీఆర్. అంతేగాక ఇలాంటి పరిస్థితుల వల్ల పట్టణ ప్రాంతాల్లో ఆర్టీసీకి నష్టాలు సర్వ సాధారణం అయిపోయిందని హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో పూడ్చాలని నిర్ణయించామని స్పష్టంచేశారు కేసీఆర్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.