ప్రమోషన్లలో వ్యక్తిగత కక్ష వద్దు: పోలీసులతో కేసీఆర్

KCR meets with Telangana police and sanctioned 500crores to the police development and guided them

KCR meets with Telangana police and sanctioned 500crores to the police development and guided them

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు 1500 మంది పోలీసు అధికారులతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. పోలీసులంటే ప్ర‌జ‌లను భ‌య‌పెట్టే విల‌న్లుగా కాకుండా తెలంగాణ పోలీస్ అంటే ప్ర‌జ‌ల‌ను ర‌క్షించే హీరోలుగా పేరు తెచ్చుకోవాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

అంతేగాక పోలీస్ ప్ర‌మోష‌న్ల‌లో పైర‌వీల‌కు ఎలాంటి అవకాశం ఉండొద్దని, పోలీసుశాఖ‌లో ప‌నిచేసే ప్ర‌తి ఉద్యోగికి వారికి న్యాయంగా రావ‌లిసిన ప్ర‌మోష‌న్‌ను స‌మ‌యానికి ఇవ్వాల‌ని ఆదేశించారు కేసీఆర్. ఈ ప్రమోషన్ల విషయంలో ఎలాంటి వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు, పైర‌వీల‌కు తావివ్వొద్ద‌న్న సీఎం ప్ర‌మోష‌న్ అనేది రావ‌లిసిన స‌మ‌యానికి వ‌స్తే సంబంధిత అధికారి త‌న విధుల‌పై దృష్టి పెట్ట‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని స్పష్టంచేశారు.

ప్రమోషన్లు సరైన సమయంలో రాకపోతే పోలీస్ అధికారులు ప‌నిని ప‌క్క‌నబెట్టి ప్ర‌మోష‌న్‌కోసం అధికారుల చుట్టూ తిర‌గాల్సి ఉంటుంద‌ని అధికారులకు వివ‌రించారు. అంతేగాక గ‌తంలో ఉన్న చెడు సంస్కృతికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ఇప్పుడు ప్రచారంలో ఉన్న క్రైం మీటింగ్ వంటి పదాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన అవసరం చాలా ఉందని సూచించిన కేసీఆర్ లేనివాడికి దేవుడే దిక్కు అని కాకుండా.. తెలంగాణ పోలీసు దిక్కు అనే విధంగా రాష్ట్ర పోలీసుల చర్యలు ఉండాలని స్పష్టంచేశారు.

ఏ దిక్కు లేనివారికి తెలంగాణ పోలీసులు ఉన్నారన్న భరోసా కల్పించాలన్నారు. ఇప్పటికే హోంగార్డు స్కిల్ డెవలప్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కమిటీ వేశామని త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటించి హోంగార్డులకు తీపి కబురు అందించనున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి. అంతేగాక పోలీసు శాఖ‌కు 500 కోట్ల బ‌హూమానం ఇస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త వాహ‌నాలు, మౌళిక స‌దుపాయాల కోసం ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయాల‌న్నారు. హైద‌రాబాద్ పోలీసుకు అద్భుత‌మైన పేరు వ‌చ్చింద‌న్నారు. చాలా గొప్ప రిజ‌ల్ట్స్ తీసుకు వ‌చ్చిన‌ట్లు మెచ్చుకున్నారు.

తెలంగాణ వ‌స్తే రాష్ట్రం న‌క్స‌లైట్ల మ‌యం అవుతుంద‌ని, లా అండ‌ర్ ఆర్డ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌ద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని, మ‌న మీద ర‌క‌ర‌కాల ప్ర‌చారం చేశార‌న్నారు. అటాంటి ఆరోప‌ణ‌ల‌ను అన్నింటిని ప‌టాపంచ‌లు చేసిన పోలీసుల‌కు ద‌క్కుతుంద‌న్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.