కల్తీలపై ఉక్కుపాదం మోపండి: కెసీఆర్

KCR orders Senior police officials on eradicating kalthi in society

గత కొంతకాలంగా తెలంగాణా రాష్ట్రంలో కల్తీ దందాలను అరికట్టడానికి జరుగుతున్న దాడులను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కల్తీలకు పాల్పడేవారి పట్ల అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. అంతేగాక రాష్ట్రంలో అన్ని రకాల కల్లీలపై ఉక్కుపాదం మోపాలని  కేసీఆర్‌ పోలీసులను ఆదేశించారు.

KCR orders Senior police officials on eradicating kalthi in society

కల్తీ విత్తనాలు, కల్తీ కల్లు తయారీదారులను తరిమి కొట్టేలా పోలీసులు వ్యూహాలు రచించాలని, ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు కేసీఆర్. కల్తీల నిర్ధారణకు ఎక్కువ డీఎన్‌ఏ కిట్లు అందించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా కల్తీలకు పాల్పడేవారిని పట్టుకున్నవారికి ఇన్సెంటివ్‌, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, వారిపై కేసులు పెట్టే వారికి అధికారులు ప్రోత్సాహం అందించాలని సీఎం కేసీఆర్‌ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. అంతేగాక అన్ని విషయాల్లో పోలీస్‌ శాఖ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు.

See Also: టీఆర్ఎస్ మద్దతు కోసం కూడా ప్రయత్నించాం

Have something to add? Share it in the comments

Your email address will not be published.