మూతబడ్డ ‘కేశినేని’ దుకాణం

Kesineni closedown his travels and quits transport business
Kesineni closedown his travels and quits transport business
చినుకు చినుకు గాలి వానగా మారడం ఎలా ఉంటుందో తెలుసుకోవలంటే కేశినేని నాని స్టోరీ చదవాల్సిందే. కేశినాని ట్రావెల్స్ పేరుతో ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టు బస్సులను, ఆ తర్వాత కార్గో బస్సులను ప్రారంభించి ట్రావెల్ బిజినెస్‌లో తనకు ఏమాత్రం ఎదురులేదనే స్థాయికి చేరుకున్న నాని గత ఎన్నికల్లో విజయవాడ నుండి టిడిపి అభ్యర్ధిగా ఎంపీగా గెలుపొందారు. ఓ ట్రావెల్స్ యజమాని ఎంపీ అయితే ఇంకేముంది ఆయన బిజినెస్ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తుందనుకొనే సమయంలో అడ్డుపుల్లలు పడి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవడం ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం బెదురుచెందని ఎంపీగారు తనకు అడ్డమొచ్చిన ఆర్టీఎ అధికారి బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడి తన దుకాణాన్ని మూసేసుకొనే పరిస్థితికి చేరుకున్నారు.
ఇటీవల రవాణా శాఖ ఉన్నతాధికారులతో వివాదం నేపథ్యంలో విలేకరుల సమావేశం పెట్టి తమ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించాలని భావించిన ఎంపీ కేశినేని నాని.. అదేరోజు మద్యాహ్నం సీఎం చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకొని బాబుతో భేటీ అయ్యారు. అయితే బాబుతో మీటింగ్ తర్వాత ఆర్టీవో అధికారి సుబ్రహ్మణ్యంకు క్షమాపణలు చెప్పిన నాని గొడవ జిరిగిన వారం రోజులకు తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసెయ్యాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో కేశినేని సంస్థకు 450 బస్సులు ఉండేవి. ప్రస్తుతం  సుమారు 170 బస్సులు మాత్రమే ఉన్నాయట. ఈ బస్సుల్లో ఫైనాన్స్ ఉన్నవి తప్ప మిగిలినవాటిని అమ్మకానికి పెట్టారు. వోల్వో కంపెనీ బస్సులను 50 లక్షల రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు తెలిసింది.
పునరాలోచించుకోవాలని చంద్రబాబు చెప్పినా.. నష్టాల కారణంగా సంస్థను మూసివేయడమే సరైందని కేశినేని భావించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఉంటూ నష్టాల బాటలో ఉన్న ట్రావెల్స్‌ను కొనసాగించడం ఇబ్బందనే ఉద్దేశ్యంతో ట్రావెల్స్ మూయాలని నాని డిసైడ్ అయ్యారట. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం వద్ద కేశినేని ట్రావెల్స్ బోర్డును యాజమాన్యం తొలగించింది.కాగా, సంస్థను మూసివేయాలన్న ముందస్తు ఆలోచనలో భాగంగానే.. ఇప్పటికే కేశినేని సంస్థ సగానికి పైగా బస్సులను విక్రయించినట్లుగా సమాచారం. అయితే విజయవాడలో కొద్దికాలం క్రితమే ప్రముఖ కాళేశ్వరీ ట్రావెల్స్‌ మూత పడింది. ఇప్పుడు కేశినేని ట్రావెల్స్‌ కూడా అదే బాటపట్టింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.