సెలబ్రిటీలకు కేటీఆర్ ఛాలెంజ్

కొన్ని నెలల క్రితం ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ ఇంటర్నేషనల్ గానూ, రైస్ బకెట్ ఛాలెంజ్ అంటూ దేశంలోనూ ఓ సవాల్ తో కూడిన ఛారిటీ కేంపెయిన్స్ నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఓ ఛాలెంజింగ్ కార్యక్రమాన్నే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆయన చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు సవాల్ లో భాగంగా సెలబ్రిటీలకు ఆయన అడిగిన ప్రశ్న సున్నితంగానే ఉన్నా, గట్టిగానే చురక అంటించేదిగా ఉండడం విశేషం.

తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ సినీ సెలబ్రిటీలకు ఓ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ ప్రకారం హ్యాండ్ లూమ్స్ ధరించి ఫోటో దిగి పోజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ‘చేనేత పనివారిని ఆదుకోవడానికి నేను హ్యాండ్ లూమ్స్ ధరిస్తున్నా.. మీ సంగతేంటి?’ అంటూ నిలదీసిన ఆయన.. కొంతమందిని ఇందుకోసం నామినేట్ చేశారు. మహేష్ బాబు, వివేక్ ఒబెరాయ్, మంచు లక్ష్మి, నాగార్జున, సమంత, సానియా మీర్జాలను ఆయన హ్యాండ్ లూమ్స్ ఛాలెంజ్ విసిరారు.

కేటీఆర్  ఛాలెంజ్ ను వెంటనే స్వీకరించిన సానియా మీర్జా.. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ పూర్తయి హైద్రాబాద్ రాగానే ధరిస్తాను’ అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు  తన తోటి ప్లేయర్లయిన మహేష్ భూపతి, రోహన్ బోపన్నలతో పాటు షట్లర్ పీవీ సింధు టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటిలకు సవాల్ విసిరింది. మంచు లక్ష్మీ కేటీఆర్ చాలెంజ్  గొప్పది అంటూ అభినందించింది.అయితే కేటీఆర్ సవాల్ కు కమల్  హాసన్ నుంచి తక్షణమే స్పందన రావడం విశేషం.

కేటీఆర్ ఛాలెంజ్ పై స్పందించిన కమల్ తాను  కూడా చేనేత వస్త్రాలను ధరిస్తానని చెప్పాడు. మా నాన్నను ఆయన జీవితం మొత్తం మీద హ్యాండ్ లూమ్స్ లో తప్ప వేరే దుస్తుల్లో నేను చూడలేదు  అని చెప్పారు కమల్ హాసన్. చేనేతకు మద్దతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది  అంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అంటే సానియా మీర్జా, దగ్గుబాటి రానాలు కూడా తమ మద్దతు ప్రకటించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి.. కేటీఆర్ చేపట్టిన కేంపెయిన్ ఓ ఉద్యమంలా మారే అవకాశం ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.