కేటీఆర్, దిగ్విజయ్ మధ్య ట్విట్టర్ వార్

KTR fires on Congress General Secretary Digvijaya Singh on allegations on Telangana Police

KTR fires on Congress General Secretary Digvijaya Singh on allegations on Telangana Police

  • కేటీఆర్, దిగ్విజయ్ మధ్య ట్విట్టర్ వార్
  • ఐసిస్ తీవ్రవాదుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం డ్రామాలాడుతుందన్న దిగ్విజయ్
  • దిగ్విజయ్ కామెంట్లపై మండిపడ్డ కేటీఆర్
  • నకిలీ వెబ్‌సైట్లు సృష్టించాల్సిన అవసరం తమకు లేదన్న తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ల మధ్య ట్విట్టర్ వార్ ముదిరింది. తెలంగాణ పోలీసులు ఐఎస్‌ఐఎస్ నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ముస్లిం యువతులను టార్గెట్ చేస్తున్నారని ద్విగిజయ్ సింగ్ ఆరోపించారు.

నకిలీ వెబ్‌సైట్ ఆధారంగా కొందరిపై కేసులుపెట్టి వేధిస్తున్నారంటూ దిగ్విజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ఘాటుగానే స్పందించారు. దిగ్విజయ్ ట్వీట్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని..లేదంటే దిగ్విజయ్ వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నేరాల రేటు తగ్గించిన పోలీసుల నైతికత దెబ్బతీసే హక్కు దిగ్విజయ్‌కు లేదన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.