మీడియాపై కెటిఆర్ గరం – తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీయకండి

KTR fires on Media paid articles that tried to dent Telangana image

రాష్ట్రం విడిపోయి మూడేళ్ళై, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అభివృద్ధిలో ఎలాంటి ఢోకా లేకుండా దూసుకెళ్తున్న తెలంగాణాపై కొన్ని మీడియా సంస్థలు కావాలని అక్కసు వెళ్ళగక్కుతున్నాయనే విమర్శలు చాలా రోజుల నుండి వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో అభివృద్ధి ఆగిపోయిందని, ఐటీ సంస్థలు తమ ఆఫీసులను తరలిస్తున్నారని, మొత్తం అంతా ఎపికి తరలివెళ్ళిపోతోందని వార్తలు అనేకం వచ్చాయి. అయితే ఈమధ్య జాతీయ మీడియాలోనూ ఎకనామిక్‌ టైమ్స్ వంటి పత్రికల్లో తెలంగాణా అభివృద్ధిపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నారు తెలంగాణా ఐటీశాఖామంత్రి కెటిఆర్.

KTR fires on Media paid articles that tried to dent Telangana image

 

కొన్ని మీడియా సంస్థలు కావాలనే తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీసేలా వార్తలు ప్రచురిస్తున్నాయని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంపై మీడియాలో కొన్ని సంస్థలు తెలంగాణా ఉద్యమ సమయం నుండే తప్పుడు కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాయన్నారు. ఎకనామిక్‌టైమ్స్‌లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ నాలుగు వారాల్లోనే హైదరాబాద్‌నుండి సుమారు 700 సంస్థలు తరలిపోతున్నాయనే కథనం ప్రచురించారని అయితే అది ఎంత అబద్ధం ఇప్పుడు తేలిపోయిందంటున్నారు కెటిఆర్. అంతేగాక ఒకవేళ ఒక రాజకీయనేత అవినీతిపరుడైతే ప్రశ్నించడానికి అనేక విధాలు ఉన్నాయని, అదే ఒక మీడియా సంస్థే అవినీతిగా తయారైతే ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమని విమర్శించారు కెటిఆర్.

ఫేస్‌బుక్‌లో కెటిఆర్ తన ఆగ్రహాన్ని ఒక పోస్ట్‌లో వ్యక్తం చేశారు.
https://www.facebook.com/KTRTRS/posts/1948780638666658

See Also: అపర చాణక్యుడికి ఈయేడాదైనా గౌరవం దక్కేనా??

Have something to add? Share it in the comments

Your email address will not be published.