“మా నాన్నగారు మాకేం తర్ఫీదు ఇవ్వలేదు” కెటిఆర్

KTR sensational Comments on CM KCR in Trs Janahitha Pragathi Sabha Public Meet at Armoor

KTR sensational  Comments on CM KCR in Trs Janahitha Pragathi Sabha Public Meet at Armoor

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ప్రజల్లోకి దూసుకెళుతూ వాళ్ళ సమస్యలను కనుక్కొంటూ ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి క‌ృషి చేస్తున్న మంత్రుల పేర్లలో మొదట వినపిచ్చే పేరు కెటిఆర్. ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉన్నప్పటికీ గత మూడేళ్ళుగా తెలంగాణాలో  ఎంతో చొరవ తీసుకొని పనిచేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమేకాకుండా తెలంగాణా రాష్ట్రానికి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కెటిఆర్ కొన్ని నిజాలు ప్రజల సమక్షంలో బయటపెట్టారు.

తెలంగాణా రాష్ట్రంలో మంచి మాటకారిగా లౌక్యం ఎరిగిన నాయకుడిగా ఎదుగుతున్న కెటిఆర్, తెలంగాణా జాగృతి సంస్థతో రాజకీయాల్లోకి ప్రవేశించి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికై పార్లమెంట్‌లో మంచి వక్తగా పేరుతెచ్చుకున్న కవితకు రాజకీయంగా తర్ఫీదు ఇచ్చింది కెసిఆరేనని అందరూ అనుకుంటుంటారు. అయితే రాజకీయపరంగా తమకు తర్ఫీదునిచ్చింది తన  తండ్రి కెసిఆర్ కాదని, తెలంగాణా ఉద్యమ ఫలితంగా, తెలంగాణా ప్రజలే తనకు తర్ఫీదునిచ్చి నాయకులుగా తయారుచేసారని చెప్పుకొచ్చారు కెటిఆర్.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ జనహిత ప్రగతిసభలో కెటిఆర్, కవిత ఇద్దరూ పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 33 నెలల్లో తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్న దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని అధికారులను కోరుతున్నట్లు కెటిఆర్ తెలిపారు. తెలంగాణాకంటే ఐదు రెట్టు జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ 36వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నాలు మొదటుపెట్టారు. అంతేగాక మన దగ్గర ప్రారంభించిన షీటీమ్స్‌ని ఆదర్శంగా తీసుకొని యాంటీ రోమియో స్క్వాడ్స్‌‌ని మొదలుపెట్టడం అనేది చూస్తే, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్‌ ప్రజలకు చెప్పుకొచ్చారు.

అంతేగాక ముఖ్యమంత్రి కెసీఆర్‌కు నిజిమాబాద్ జిల్లా అంటే ఎంతో ప్రత్యేక అభిమానం ఉంని అందుకే నిజామాబాద్ కార్పోరేషన్ అభివ‌ద్ధికి 100కోట్ల రూపాయలు, చుట్టూ ఉన్న నాలుగు మున్సిపాలిటీల అభివృద్ధికి 50కోట్ల చొప్పున మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రెండు విడతలుగా ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయని తెలిపారు కెటిఆర్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.