టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

KTR targets at 2019 elections with new ideas and change in Constituency

తెలంగాణా రాష్ట్రం ఏర్పడకముందు ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా గెలిచిన యంగ్ లీడర్ కెటిఆర్. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో కీలక వ్యక్తిగా మారిన కెటిఆర్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యవేక్షణతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటున్నారు. దీంతో 2019 ఎన్నికలకు ముందు కెటిఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకొని, దాని అమలులో భాగంగా గ్రౌండ్ వర్క్ తెగ చేస్తున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

KTR targets at 2019 elections with new ideas and change in Constituency

తెలంగాణాలో 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే హడావిడి మాత్రం మొదలైపోయింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో ఎన్నికల్లో వివిధ పార్టీల్లో ఒకరిపై ఒకరు పోటీలో నిలబడ్డ నాయకుల్లో చాలామంది ఇప్పుడు కారెక్కేయడంతో గులాబీదళం బలం పెరుగుతోంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సంఖ్య పెరిగిందో లేదో కానీ సీట్లు ఆశించే నాయకుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో గులాబీ నాయకులకు కొత్తరకమైన ఒత్తిడి ప్రారంభమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న టిఆర్ఎస్ నాయకులను కాదని ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన నాయకులకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పడనుంది.

అంతేగాక తెలంగాణ సీఎం కేసీఆర్ జెట్ స్పీడ్‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైపోతున్నారు. ముంద‌స్తు స‌ర్వేలు, ముంద‌స్తు అంచ‌నాలు అధికార టీఆర్ఎస్‌కు కాస్త అనుకూలంగా ఉండ‌డంతో కేసీఆర్ హుషారుకు బ్రేకులు కూడా ప‌డేలా లేవు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఓ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై ఫుల్ కాన్పిడెన్స్‌గా ఉండ‌డంతో పాటు మ‌రో వైపు ఏ మాత్రం ఏమ‌రుపాటుకు తావివ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోతారని అనుకుంటున్నారో ఆయా స్థానాలపై ద‌ృష్టిపెట్టి అక్కడ గెలిచే నాయకులు ఇతర పార్టీల్లో ఉంటే వాళ్ళని కారెక్కించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

See Also:మీడియాపై కెటిఆర్ గరం – తెలంగాణా ఇమేజ్‌ను దెబ్బతీయకండి

మరోవైపు  సీఎం కెసిఆర్ తర్వాత నెంబర్‌ 2 గా ఉన్న కెటిఆర్ ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టే తాజా ప‌రిణామాలు చెపుతున్నాయి. ప్ర‌స్తుతం సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ ప‌రిధిలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. సిరిసిల్ల కేటీఆర్‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినప్పటికీ హైద‌రాబాద్‌కు దూరంగా ఉండటంతో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో త‌ర‌చూ ప‌ర్య‌టించ‌డానికి కుద‌ర‌ట్లేదు. అంతేగాక సిరిసిల్లలో ప్రభుత్వ పరువును నిలబెట్టేలా, తన పరువు తీయకుండా ఉండే నమ్మకమైన నాయకులు ఎవరూ కేటీఆర్‌కు అందుబాటులో లేరు.

వీటికితోడు ఈమధ్య చేనేత కార్మికుల ఆత్మ‌హ‌త్య‌లు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ‌వుతున్నాయి. ఇక అసెంబ్లీ స‌మావేశాలు, విదేశీ పర్య‌ట‌న‌లు, ఫారిన్ డెలిగేట్స్‌తో మీటింగ్‌ల‌తో బిజీ అవుతోన్న కేటీఆర్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్నే ఎంచుకునేందుకు కేటీఆర్ ప్లాన్ చేశారు. అయితే ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్‌, కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి నిలబడితే ప‌రిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై తన టీం ద్వారా స‌ర్వే చేయించుకొని, ఈ మూడు నియోజకవర్గాలకంటే ఉప్పల్ అయితేనే బెటర్ అనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

See Also: “మా నాన్నగారు మాకేం తర్ఫీదు ఇవ్వలేదు” కెటిఆర్

అందులోభాగంగానే కేటీఆర్ ఈమధ్య ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చూ ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డ అభివృద్ధికి ప్ర‌త్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారు. లేటెస్ట్‌గా సోమవారం ఉప్పల్‌‌లో పర్యటించిన కెటిఆర్ బగాయత్‌ రైతులకు అభివృద్ధి పరిచి కేటాయించిన ప్లాట్లను మరో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఉప్పల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అయ్యే వ్యయాన్ని హెచ్‌ఎండీఏ భరిస్తుందని, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్‌ దూసుకెళ్తొందన్న కేటీఆర్‌.. ఉప్పల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ప్రకటించారు.

అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజల నుంచి భూములు సేకరించాల్సి వస్తే.. వారు అసంతృప్తికి లోనుకాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చిన కెటిఆర్, మూసీ నదిని సుందరీకరించి సబర్మతికి దీటుగా తీర్చిదిద్దుతామని, ఉప్పల్‌లో మినీ శిల్పారామాన్ని, కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనున్నట్టు వరాల జల్లు కురిపించారు.

ఉప్పల్ నియోజకవర్గంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ మధ్య గట్టిపోటీ ఉన్నప్పటికీ, అప్పటి మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి అండదండలు, ఆర్థికసహకారాలతో తక్కువ మెజారిటీతో బిజెపి అభ్యర్థి ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్థికంగా బలమైన ఎంపీ మల్లారెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేరడంతో 2019 ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బే తగలనుంది. అంతేగాక 2019 ఎన్నికల్లో కెటిఆర్‌లాంటి స్టేచర్ ఉన్న నాయకుడు ఉప్పల్‌నుండి టీఆర్ఎస్ తరుపున పోటీకి నిలబడితే గెలుపు నల్లేరుమీద నడకేనని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అనుకుంటున్నారు.

See Also: ‘ప్రజల ఆకాంక్ష – నిరంకుశ పాలన మధ్య ఘర్షణ’ : కోదండరాం

Have something to add? Share it in the comments

Your email address will not be published.