మారుతున్న సర్కారీ దవాఖానాలు

KTR Tweets: Changing face of Health care in Telangana

మురికి కూపాలుగా ఉండే మన సర్కారీ దవాఖానాలకు మహర్దశ పట్టనుంది. శుభ్రతలేకపోవడం, వసతుల విషయంలో ఎప్పుడూ ఏదో ఒకలోపంతో ఉండే ప్రభుత్వాసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తయారు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులోభాగంగా కింగ్ కోటి, మలక్‌పేట్ వైద్యశాలలు నూతన శోభను సంతరించుకున్నాయి.

KTR Tweets: Changing face of Health care in Telangana

తెలంగాణ వైద్య సేవల రూపు రేఖలు మారుతున్నాయి. పెరుగుతున్న కార్పోరేట్ వ్యాపారాన్ని నిలువరించేందుకు వాటికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారుచేసే పనిలో భాగంగా మున్సిపల్ శాఖ, ఆరోగ్యశాఖ సంయుక్తంగా నూతనీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందులోభాగంగా ముందుగా రెండు ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసిన ప్రభుత్వం  తమ పనితీరును చూపించింది.

See Also: ఈ నాలుగు నెలల్లో ఏం జరిగింది??

ప్రజలకు అందుబాటులోకి వైద్య రంగాన్ని తీసుకురావడం,  అన్ని వర్గాలు కూడా వైద్య విభాగాన్ని ఆదరిస్తున్నాయి అంటూ తన ట్విట్టర్లో ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు. కొత్తగా తయారైన కింగ్ కోటి, మలక్‌పేట్ వైద్యశాలల ఫోటోలను తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

కేసీఆర్ మార్గదర్శనంలో ఇదే తరహా అబివృద్ధిని, ప్రగతిని వైద్య రంగం విస్తరణలో కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్‌కి లక్ష్మారెడ్డి చెప్పారు. అంతేగాక వైద్యరంగం ప్రగతి, పనితీరును కేటీఆర్ అభినందించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ అభినందనలు తమ శాఖ పనితీరుకి అద్దంపట్టడమేగాక, బాధ్యతను మరింత పెంచుతున్నాయన్నారు లక్ష్మారెడ్డి.

See Also: శిరీష, తేజస్విని ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నాడా??

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.