మరో రెండు వారాల్లోనే పుట్టినరోజు… అంతలోనే

హైదరాబాద్: “ఇలాంటి మరణాన్ని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉందని, ఇంతలోనే ఈ ఘటన జరగడం తీవ్ర ధిగ్ర్భాంతికి గురిచేసిందని“ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన తెలిపారు. క్యాన్సాస్ లోని ఓలాథేలో ఆమె మీడీయాతో మాట్లాడుతూ తన భర్తను కాల్చి చంపడం తమ కుటుంబానికి తీవ్ర మనోవేదనానికి గురిచేసిందని కన్నీటి పర్యంతమయ్యారు.

ఏం చెప్పాలో అర్ధం కావడం లేదని, ఎక్కడో ఒక దగ్గర కాల్పులు జరుగుతున్నాయని చాలా సార్లు వార్తా పత్రికల్లో చదివేవాళ్లమన్నారు. మనం సురక్షితంగానే ఉన్నామా, అమెరికాలో ఉంటూ మనం మంచి పనే చెస్తున్నామా అని నేను ఎప్పుడూ ఆందోళన చెందేదాన్ని సునయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మంచి వాళ్లకు మంచే జరుగుతుందని ఆయన ఎప్పుడూ ఓదార్చేవారని సునయన తెలిపారు.

అదే విధంగా జాతి వివక్షను అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని కూచిభట్ల సునయన డిమాండ్ చేసింది. కన్సాస్‌లో ఓ అమెరికన్‌ జాత్యహంకార కాల్పుల్లో శ్రీనివాస్‌ మరణించగా, అలోక్‌ అనే యువకుడు గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. అలోక్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తెలుగు యువకులను కాపాడేందుకు కాల్పులను అడ్డుకోబోయిన మరో అమెరికన్‌ గ్రిల్లాట్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.