లావణ్య త్రిపాఠి రాబిట్ పిల్ల ఎందుకైంది?

Lavanya Tripathi talks about Radha and Sharwanand

Lavanya Tripathi talks about Radha and Sharwanand

అందాల రాక్షసితో తెలుగు సినిమా కెరీర్ మొదలుపెట్టి మొదటి సినిమాతోనే తెలుగువారి గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటివరకు లావణ్య చేసిన దాదాపు అన్ని సినిమాలు మంచి టాక్‌తో హిట్ కొట్టినవే. నానితో భలే భలే మగాడివోయ్, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా, అల్లు శిరీష్‌తో శ్రీరస్తు శుభమస్తు, వరుణ్‌తేజ్‌తో మిస్టర్ సినిమాల్లో నటించి సాంప్రదాయ దుస్తుల్లో మెప్పించిన లావణ్య కాస్త ట్రెండీ లుక్‌లో కనిపించబోయే సినిమా రాధ.

శర్వానంద్ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కి ఈ నెల 12న విడుదలకు రెడీగా ఉన్న సినిమాలో రాధ క్యారెక్టర్ చేస్తున్న శర్వానంద్ లావణ్య త్రిపాఠిని రాబిట్ పిల్ల అని ఎందుకు పిలుస్తాడో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

అయితే ఈమధ్యలో సినిమా విశేషాలను లావణ్య మీడియాతో పంచుకుంది. ‘ఈ సినిమాలో నేను కాలేజ్ స్టూడెంట్‌గా న‌టించాను. నా పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. లుక్ వైస్‌, సాంగ్స్, యాక్టింగ్‌, బిహేవియ‌ర్‌ అంతా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఆర్టిస్ట్ లాగా ఉంటుంది. ఇందులో నాకు మాస్ సాంగ్ ఉంది. క్లాసిక‌ల్ సాంగ్ కూడా ఉంది. చాలా బావుంటుంది. ఈ మూవీలో కామెడీ కూడా చేశాను. అది సిట్చువేష‌న‌ల్ కామెడీ. చాలా వైవిధ్యంగా క‌నిపిస్తాను. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ నాకు చాలా బాగా న‌చ్చింది. స‌స్పెన్స్ ఉంటుంది. డ్రామా కూడా ఉంటుంది. చాలా ఇంట్ర‌స్టింగ్ క‌థ‌. హీరోని స‌పోర్ట్ చేస్తాను. రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. కామెడీ ఉంటుంది. ఎమోష‌న్ ఉంటుంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మిది.’

శర్వానంద్ చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తాడు. నేను చాలా ఎక్కువ‌గా మాట్లాడేదాన్ని. త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్ శ‌ర్వా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాడు. ఆఫ్ స్క్రీన్‌లో త‌ను చాలా షైగా ఉంటాడు. కానీ త‌న ఆన్‌స్క్రీన్ పెర్ఫార్మెన్స్ బెస్ట్ గా ఉంటుంది. నాకు పోలీసులు కొత్త కాదు. మా నాన్న‌ లాయ‌రు. మా సిస్ట‌ర్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌. త‌న స్నేహితులు ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌లున్నారు. కాబ‌ట్టి నాకు పోలీసులు కొత్త కాదు. నేను చాలా ల‌క్కీ. చాలా మంచి నిర్మాత‌ల‌తో ప‌నిచేస్తున్నా. అల్లు అర‌వింద్‌, బాబీ, టాగూర్ మ‌ధు, ప్ర‌సాద్ వంటివారంద‌రితో చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ ప్రొడ్యూస‌ర్‌ బాబీ సార్ అమేజింగ్. త‌న‌తో ఇంకో సారి ప‌నిచేయాల‌ని ఉంది. ప్ర‌సాద్‌గారితో చాలా హ్యాపీ. సెట్స్లో చాలా ఫ‌న్నీగా ఉండేవారు.’ అని చెప్తోంది లావణ్య త్రిపాఠి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.