భయపెట్టడానికి ఏప్రిల్ 14న వస్తున్న లారెన్స్

Lawrence Rithika singh Starer Sivalinga Releasing on April14th
Lawrence Rithika singh Starer Sivalinga Releasing on April14th
కాంచన, గంగ వంటి సినిమాలతో తనలోని నటనను బయటపెట్టిన నటుడు రాఘవ లారెన్స్. గురు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రితిక సింగ్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా శివలింగ్. అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ మీడియా   అధినేత మ‌ల్కాపురం శివ‌కుమార్‌, నిర్మాత ర‌మేష్ పిళ్ళై పాత్రికేయుల‌తో మాట్లాడారు.
మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. శివలింగ సినిమా చూశాను. చాలా బాగుంది.హార్రర్ సినిమాల్లో ఇది నెక్ట్స్ లెవెల్ లో ఉండే చిత్రమిది. తెలుగులో మా సురక్ష బ్యానర్ ద్వారా విడుదల చెస్తున్నాము.కాంచ‌న‌, గంగ చిత్రాల స‌క్సెస్‌ల‌తో లారెన్స్ న‌ట‌నేంటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసింది. క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డంలో రూపొందిన శివ‌లింగ చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో తెలుగు, త‌మిళంలో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌పై అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ర‌మేష్ పిళ్లై నిర్మించారు. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుందని తెలిపారు.
క‌న్న‌డ‌లో శివ‌లింగ పేరుతో శివ‌రాజ్‌కుమార్‌గారు న‌టించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌తో రీమేక్ చేశాం. వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా రూపొందింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. లారెన్స్‌గారికి కాంచ‌న కంటే మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుందని అభిషేక్ ఫిలింస్ అధినేత ర‌మేష్ పిళ్ళై చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.