మళ్ళీ మొదలైన లీకేజీ గోల

Leakage row AP minister and YSRCP MLA fights on leakage issue

అమరావతిలో రాజధాని నిర్మాణం సంగతేమో కానీ వర్షాలు పడిన ప్రతీసారి లీకేజీ సమస్యలతో అధికారపక్షం, ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు చేసుకోవడానికి సరిపోతోంది. గతంలో అసెంబ్లీ భవనంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్‌లో లీకేజీ అయినప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. మల్ళీ ఇప్పుడు అలాంటి లీకేజీ దుమారానికే తెరలేచింది.

Leakage row AP minister and YSRCP MLA fights on leakage issue

వర్షాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే పడుతున్నట్లుగా అనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రుతుపవనాలు ఊపందుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో పలు ఛాంబర్లలో వర్షపు నీరు లీక్‌ అవుతోంది. 4వ బ్లాక్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మంత్రి గంటా యాంటీ రూమ్, దేవినేని ఉమ ఛాంబర్ తో పాటు పలుచోట్ల వర్షపు నీరు లోపలికి వచ్చింది. కొన్ని చోట్ల విండో గ్లాస్‌ల నుంచి, కొన్నిచోట్ల పై ఫ్లోర్ నుంచి వాటర్ లీక్‌ అవుతోంది. గంటా యాంటీ రూమ్‌లో సీలింగ్‌ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు.

See Also: పంటభూమిలో భవనాలు కడితే…

మరోవైపు ఏపీ సచివాలయంలో తాజా లీకేజీలపై మున్సిపల్‌ మంత్రి నారాయణ స్పందించారు. లీకేజీలు చాలా చిన్న విషయమని.. కావాలనే భూతద్ధంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. స్లాబ్‌‌పై ఉన్న డక్‌ షీట్‌ బయటకు రావడం వల్లే  నీళ్లు లీకయ్యాయని మంత్రి తెలిపారు. కట్టుకున్నఇళ్లలో కూడా మొదట్లో చాలా లోపాలుంటాయని.. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వర్షం తగ్గగానే మరమ్మత్తులు చేస్తామన్నారు. లోపాలను రెండేళ్లపాటు నిర్మాణ సంస్థలే సరిచేస్తాయని ఆయన స్పష్టంచేశారు.

See Also: లీకేజీలో కుట్రకోణం నిజంగానే దాగుందా??

అయితే మంత్రి నారాయణ వ్యాఖ్యలపై మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు ఆర్కె మండిపడ్డారు. ఏపీ సచివాలయం ఛాంబర్ల లీకేజీ వెనుక చాలా పెద్ద ప్యాకేజీ ఉందని ఆరోపించారు. అంతేగాక నారాయణకు, ప్రభుత్వానికి, చంద్రబాబుకు వచ్చిన ప్యాకేజీ మాత్రం భారీ ఎత్తున ఉండి ఉంటుంది అందుకే లీకేజీ వెనుక అసలు విషయం ప్రజలకు తెలియకుండా దాచిపెడ్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌ కూడా వర్షంనీరు చేరింది. దానిపై సీఐడీ ఎంక్వైరీ వేశారు. నెలరోజుల గడుస్తున్నా దానిపై కదలిక లేదు. ఇప్పుడు మంత్రుల ఛాంబర్లు కురుస్తున్నాయి. ఓ వైపు వర్షం, మరోవైపు అధికారులు పని చేసుకోవాలి. దీంతో వాళ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

చిన్న వర్షానికే ఇలా ఉంటే తుపాను వస్తే పరిస్థితి ఏంటి?. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో కేవలం విశాఖలో రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం అయ్యాయి. ఇప్పుడు కూడా సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఏ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చారో వాళ్లకు సంబంధించిన పైళ్లు మాయం అయ్యే అవకాశం ఉంది. దీనిపై సీఐడీ కాదు సీబీఐ విచారణ జరిపించాలి.’ అని ఆర్కే డిమాండ్‌ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.