ఇప్పటికైనా కళ్ళుతెరుద్దామా???

Lets unite in closing down unused Bore wells to save our Children

ఏ విషయంలోనైనా తర్వాత చూసుకుందాములే అనే మన నిర్లక్ష్యం మన చిన్నారుల ప్రాణాలపైకి తీసుకొస్తున్నప్పుడు హడావిడి పడి వాళ్ళను కాపాడుకోవడానికి మనం పడే ఆతృత ఆ తర్వాత ఆవిరైపోతోంది. మళ్ళీ దేశంలో ఎక్కడైనా అలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం మనలో ఏదో చేసెయ్యాలని ఆలోచిస్తుంటాం.

Lets unite in closing down unused Bore wells to save our Children

ప్రస్తుతం చేవెళ్ల మండలంలో నిన్న ఒక చిన్న పాప ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు వాడకంలో లేని బోరు బావిలో పడింది. పాపను రక్షించేందుకు అధికారులు ఇంకా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కన్నా ముందే స్పందించడం మంచిది.

కాబట్టి మీ గ్రామంలో ఏవైనా వాడకంలో లేని బోరు బావులు ఉన్న యెడల వెంటనే వాటిని మూయించండి. ఎవరైనా యజమానులు నిరాకరిస్తే మీకు దగ్గర్లోని పోలీసు స్టేషనల్లో తెలియచేయండి. పోలీసులే  మీ గ్రామానికి వచ్చి వాటిని మూయిస్తారు. ఇంకో చిన్నారికి కీడు జరగకముందే అందరం స్పందిద్దాం. సకలం మీవెంటే ఉంటుంది. మన చిన్నారులను కాపాడుకుందాం..

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Anonymous says:

    నైస్ ఆర్టికల్స్ …గుడ్ pagenation

  • దుర్గారావు says:

    నైస్ ఆర్టికల్స్ …గుడ్ pagenation