నితిన్ సినిమాలో హాలీవుడ్ హీరో

Hollywood Hero Dan bilzerian in Nithin starrer 'LIE' and the film unit is presently shooting in USA

Hollywood Hero Dan bilzerian in Nithin starrer 'LIE' and the film unit is presently shooting in USA

యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా లై కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. నితిన్ సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ లై సినిమాలో హాలీవుడ్ హీరో డాన్ బిల్జేరియన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వతహాగా పోకర్ ప్లేహర్ అయిన డాన్ గతంలో హాలీవుడ్‌లో పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించాడు. లోన్ సర్వైవర్, ది ఈక్వలైజర్, క్యాట్ రన్ 2 వంటి సినిమాల్లో నటించాడు.

Hollywood Hero Dan bilzerian in Nithin starrer 'LIE' and the film unit is presently shooting in USA

వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది.

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ప్రస్తుతం మా చిత్రం షూటింగ్‌ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో జరుగుతోంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.