అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగి మధుకర్ రెడ్డి ఆత్మహత్య

madhukar reddy techie from telangana commits suicide in seattle

madhukar reddy techie from telangana commits suicide in seattle

వాషింగ్టన్: అమెరికాలో సీటెల్ నగరంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ లోని యాదాద్రి జిల్లా, భువనగిరికి చెందిన గూడూరు మదుకర్ రెడ్డి, (27)  ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సీటెల్ లోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో రెడ్డి గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా సీటెల్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. వీరి దంపతులకు ఏడు ఏళ్ల కుమార్తె ఉంది.

మధుకర్ రెడ్డి యాదాద్రి జిల్లా, రాళ్ల జనగామ్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం తన కుటుంబం సభ్యులు భువనగిరిలోని  కిసాన్ నగర్ లో నివసిస్తున్నారు.

రెడ్డి ఆత్మహత్య చేసుకునే కొద్ది గంటలసేపు ముందు తన తల్లికి సంక్షిప్త సమాచారాన్ని సెల్ ఫోన్ ద్వారా పంపాడు. అందులో “దయచేసి నన్ను మన్నించు అమ్మా“ అని ఉందని రెడ్డి తల్లి తెలిపారు.

“అతను ఆర్థికంగానే ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే కొంతకాలం నుండి భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయని తెలిసింది. అదే అతని ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణమని నిర్ధారించలేమని“ రెడ్డి బంధువు దుర్గారెడ్డి తెలిపారు.

రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన కారణాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.