మహబూబాబాద్ ఎమ్మెల్యేపై కలెక్టర్ ఫిర్యాదు

Mahabubabad MLA Shankar naik abusive behaviour with Collector Preeti Meena1

అందరిదీ ఒక దారైతే… తనదొక్కడిదే మరోదారి అన్నట్లు ఉంటారు కొందరు. తెలంగాణా రాష్ట్రంలో పండగ వాతావరణంలో హరితహారం కార్యక్రమం జరుగుతుంటే మహబూబాబాద్ ఎమ్మెల్యే వల్ల ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మహూబూబాబాద్ కలెక్టర్ ప్రీతీమీనాతోపాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేయిని అసభ్యకరంగా పట్టుకున్నట్లు శంకర్ నాయక్ మీద ఆమె ఆరోపణలు చేశారు.

Mahabubabad MLA Shankar naik abusive behaviour with Collector Preeti Meena1

 

దీంతో తీవ్ర మనోవేధన చెందిన కలెక్టర్ శంకర్ నాయక్ తీరుపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే తీరు సరిగా లేదని అతడితో హరితహారం కార్యక్రమం వద్దే గొడవకు దిగారు. ఎమ్మెల్యే కూడా తగ్గకుండా ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించారని కలెక్టర్ ఆరోపించారు. ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. అంతేగాక కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనకు నిరసనగా కలెక్టరేట్ సిబ్బంది ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

See Also: నేను ఎంత మొండో మీ అందరికీ తెలుసు: కేసీఆర్

 

Mahabubabad MLA Shankar naik abusive behaviour with Collector Preeti Meena

మరోవైపు కలెక్టర్ తనకు జరిగిన అవమానంపై సిఎస్ ఎస్పీ సింగ్ కు ఫిర్యాదు చేశారు. అలాగే ఐఎఎస్  ల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇక కలెక్టర్ కు జరిగిన అవమానంపై ఐఎఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు సీరియస్ అయ్యారు. రేపు సిఎం కెసిఆర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సంఘటనపై సిఎం కెసిఆర్ స్పందించారు. ఎమ్మెల్యే పై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని శంకర్ నాయక్ కు సూచించారు. శంకర్ నాయక్ తన ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని సిఎం హెచ్చరించారు.

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

 

 

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.