అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు

Mahanadu: Jagan Mohan Reddy can’t Stops AP Projects

విశాఖపట్నం: “అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని, అదే విధంగా జగన్ మెహన్ రెడ్డి అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని“ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడులో సోమవారం ఆయన ప్రసంగించారు.

“36 సంవత్పరాల క్రితం ఒక మహానుభావుడు వేసిన విత్తనం నుంచి మొక్క వచ్చి పెరిగి పెరిగి ఈ రోజు ఒక మహా వృక్షమైంది. ఆ మొక్కకు కాపాలకాస్తూ ఎరువువేసి, నీళ్లు పోసి కరువు, తుఫాను వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటమాలిగా పనిచేశారన్నారు. ఆ మహావృక్ష నీడలోనే ఈ రోజు మనందరం హాయిగా ఉన్నామని ఆయన తెలిపారు.

“రూ 42.92 కోట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చుపెట్టింది. దాంట్లో 10 కోట్లు కార్యకర్తల పిల్లల చదువులకు, వాళ్ల ఆరోగ్యానికి ఖర్చుచేసింది. ప్రమాదవశాత్తు ఏ కార్యకర్త మృతిచెందితే వాళ్ల కుటుంబాలకు రూ 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్నిచ్చి ఆదుకున్నది. భారత దేశంలో 17 వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క రాజకీయపార్టీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమం పార్టీ కార్తలకు చేపట్టలేదని“ లోకేష్ తెలిపారు.

“2104లో 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేశాం. లోటు బడ్జెత్ తో జీతాలు ఇవ్వగలమా అని చాలా మందికి సందేహం వచ్చింది. కానీ ముఖ్యమంత్రి ఒక పద్ధతి ప్రకారం మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగారని దానిని అధిగమించారని“ లోకేష్ కొనియాడారు. అదే విధంగా

“ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ  మూడు సంవత్సరాల్లోనే రూ 1.35 వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రరాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిదే. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఆయన తెలిపారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ఐటి హబ్ గా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతామని“ ఈ సంద్భంగా లోకేష్ హామీ ఇచ్చారు.

“మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మనకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క కులం వాడుతున్నారు. ఇంకోపక్క మతం వాడుతున్నారు, మరోపక్క ప్రాతం కూడా వాడుతున్నారు. కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోని మనం అంతా కష్టపడాలని“ కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.