భవిష్యవాణి: సకాలంలో వర్షాలు కురుస్తాయి

Mahankali Bonalu completes with Swarna Latha Bhavishyavani

రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర భవిష్యవాణితో ముగిసింది. ప్రతీ యేడాది మాదిరిగినే జాతరలో రెండో రోజు ఉదయం ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

Mahankali Bonalu completes with Swarna Latha Bhavishyavani

మహంకాళి బోనాల జాతర ఆనవాయితీగా వస్తున్న భవిష్యవాణి వినేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత భక్తులకు ఎలాంటి ఆపదలు రానివ్వనని, గ్రామస్థులందరూ సుఖశాంతులతో ఉండేలా సమానంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాక సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలతో రాష్ట్రం విరాజిల్లుతుందని భవిష్యవాణిలో స్వర్ణలత వెల్లడించారు. అందరు ప్రజలు సుఖశాంతులతో ఉంటారని స్పష్టంచేశారు.అంతేగాక  తనకు సేవ చేసినా చేయకపోయినా భక్తులంతా తన బిడ్డలేనని పేర్కొన్నారు. వెల్లడించారు.

See Also: పోలీసుల్లో గులాబీ భక్తి: బోనాల్లో కేంద్రమంత్రికి అవమానం

Have something to add? Share it in the comments

Your email address will not be published.