ఇదేం పైత్యం కమలనాథా…??

Maharashtra BJP Leader kissing in moving bus video goes viral

పార్టీ అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందిలే అనుకొనే పైత్యులు మనదేశంలో ఎక్కువౌతున్నారు. మామూలుగానే రాజకీయనాయకులంటేనే జనాలు అసహ్యించుకొనే స్థితి నుండి బయటికిరాకుండా మరింత దిగజారుతున్నారు మన మేధావులు. అధికార మదం తలకెక్కితే గల్లీ లీడర్‌ కూడా తానే మోడీ అన్నట్లు వ్యవహరిస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు.

Maharashtra BJP Leader kissing in moving bus video goes viral

భారతీయ జనతా పార్టీ అనగానే ఆర్‌ఎస్ఎస్ నియమావళి, మహిళల పట్ల గౌరవంగా మెలగడం, అందరితోనూ సంస్కారవంతంగా వ్యవహరించడం అనే పరిస్థితికి మచ్చ తెస్తున్నారు కొందరు గల్లీ లీడర్లు. తాము చేసే చెత్త పనుల వల్ల పార్టీ పరువు భ్రష్టుపడుతోందన్న ఇంగితంలేకుండా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్‌గా మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటన రాజకీయనాయకులను ఛీత్కరించే పరిస్థితికి తీసుకొచ్చింది.

చంద్రపూర్ జిల్లా స్థానిక బీజేపీ నాయకుడు రవీంద్ర బవాన్‌థాడే అనే మహా మేధావి కదిలే బస్సులో ప్రయాణికులంతా చూస్తుండగానే జంకుబొంకు లేకుండా మహిళను ముద్దుపెట్టుకున్న వ్యవహారం వెలుగుచూడటంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళను ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించినట్టు వీడియో దృశ్యాల్లో ఉంది.

See Also: వర్మ ఇప్పుడేం వివాదాలు బయటపెడ్తాడో..!

రవీంద్ర బవాన్‌థాడేపై బాధితురాలు రేప్‌ కేసు పెట్టడంతో ఆయన పరారయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రవీంద్ర తనను మోసం చేశాడని పోలీసులతో బాధితురాలు చెప్పారు. బీజేపీ నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించేందుకు తటపటాయిస్తున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.