శభాష్ ఫడ్నవీస్

Maharashtra CM Devendra Fadnavis Announces 34 Thousand Crore Farm Loan Waiver

రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దో గొప్పో రైతులకు సాయం చేసినప్పటికీ ఏప్రిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో 36వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు.

Maharashtra CM Devendra Fadnavis Announces 34 Thousand Crore Farm Loan Waiver

తాజాగా రైతు రుణ మాఫీ చేసిన జాబితాలో మహారాష్ట్ర కూడా వచ్చి చేరింది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 34వేలకోట్ల రూపాయల విలువైన రైతు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందులోభాగంగా లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు.

ఈ నెల మొదట్లో రైతులు చేసిన 11రోజుల ఆందోళనతో కూరగాయల ధరలు ఆకాశానికి ఎక్కడంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అప్పట్లో రైతు రుణ మాఫీ చేస్తానని ప్రకటించారు. అందులోభాగంగా క్రమం తప్పకుండా రుణాన్ని తిరిగి చెల్లిస్తున్న రైతులకు కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూర్చనున్నామని, ఇప్పటివరకు చెల్లించిన దానిలో 25శాతం రాయితీగా తిరిగి ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతు రుణమాఫీ పథకం కింద 89 లక్షలమంది రైతులు లబ్ధి పొందనున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.

రైతు రుణమాఫీ వల్ల ఖజానాపై ఎంత భారం పడుతుందో తమకు తెలుసునని, అయితే, తమ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా కొంత భారాన్ని తగ్గిస్తామని సీఎం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ తమ ఒక నెల జీతాన్ని రుణమాఫీ పథకానికి మద్దతుగా అందివ్వనున్నారని చెప్పారు. మరోవైపు రుణమాఫీ అడగడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్య నాయుడు నిన్న సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజు ఫడ్నవీస్ రుణమాఫీ ప్రకటించి అదంరినీ ఆశ్చర్యపరిచారు.

రుణమాఫీ అనేది అంతిమ మార్గం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే రుణమాఫీ వైపు ఆలోచించాలని సూచించారు. అంతేగాక రైతులు పండించిన పంటలకు మద్దతు ధర వచ్చినట్లైతే రుణమాఫీ అవసరం ఏమాత్రం ఉండదని, రైతుల పంటలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా రైతులకు మేలు చేసినట్లు అవుతుందని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.